Rohit Sharma: కెరీర్ క్లోజ్.. రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన రోహిత్..
ABN , Publish Date - Dec 18 , 2024 | 09:41 AM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే తాజాగా అది మరింత బలపడింది. ఆ దిశగా అతడి హింట్‌తో రిటైర్మెంట్ న్యూస్‌కు మరింత ఊతం ఇచ్చినట్లయింది.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే తాజాగా అది మరింత ఊపందుకుంది. ఆ దిశగా అతడు ఇచ్చిన హింట్‌తో రిటైర్మెంట్ న్యూస్‌కు మరింత ఊతం ఇచ్చినట్లయింది. ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ చేసిన ఒక పని తెగ వైరల్ అవుతోంది. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ కన్ఫర్మ్, అతడి కెరీర్ క్లోజ్ అని ఈ హింట్‌కు ఎన్నో అర్థాలు తీస్తున్నారు. అసలు భారత సారథి ఏం చేశాడు? దానికి రిటైర్మెంట్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ హింట్‌కు అర్థం ఏంటి?
గబ్బా టెస్ట్ భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు రోహిత్. రెడ్ బాల్ క్రికెట్‌లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్.. మూడో టెస్టులోనూ అదే రిపీట్ చేశాడు. 27 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే పెవిలియన్ దిశగా వెళ్తూ వెళ్తూ తన గ్లౌవ్స్‌ను అతడు విసిరిపారేశాడు. అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్‌ను విసిరి సీరియస్‌గా డగౌట్‌కు వెళ్లిపోయాడు రోహిత్.
గ్లౌవ్స్ ఎందుకు విసిరాడు?
వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రోహిత్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో అతడు క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. ఈ తరుణంలో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. అతడు రిటైర్మెంట్ మీద హింట్ ఇచ్చాడని అంటున్నారు. గెలుపోటములు, విజయాలు-వైఫల్యాలకు అతీతంగా ఉండే హిట్‌మ్యాన్ ఎప్పుడూ అసహనం చూపించడు. అలాంటోడు ఇలా ప్రవర్తించేసరికి కెరీర్ ముగింపు గురించి చెప్పకనే చెప్పేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ గుడ్‌బై చెప్పేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత 50 ఓవర్ల క్రికెట్ నుంచీ సెలవు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో రోహిత్ గ్లౌవ్స్ విసిరేయడంతో అనూహ్యంగా టెస్ట్ రిటైర్మెంట్ మీదా రూమర్స్ మొదలయ్యాయి. మరి.. హిట్‌మ్యాన్ అలా ఎందుకు చేశాడనేది అతడికే తెలియాలి.
Also Read:
చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా
దేవుడా.. ఇంకెన్ని చేయాలి!
గెలిచినంత సంబరం
గుకేష్‌కు ఘన సన్మానం
For More Sports And Telugu News