Share News

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:07 PM

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది.

Sara Tendulkar: గబ్బాలో సారా టెండూల్కర్ సందడి.. అతడి కోసమే స్పెషల్‌గా..
Sara Tendulkar

IND vs AUS: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోమారు క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసింది. గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు ఆమె అటెండ్ అయింది. గ్యాలరీలో హల్‌చల్ చేసింది సారా. బ్లూ కలర్ డ్రెస్‌లో, నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని హీరోయిన్లను తలపించే గ్లామర్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. సారా లుక్స్, అందం, స్మైల్‌కు ఫిదా అవుతున్నారు. అదే టైమ్‌లో ఆమెపై ట్రోల్స్ కూడా వేస్తున్నారు.


అటు ఫ్యామిలీ.. ఇటు సారా

గబ్బా మ్యాచ్‌కు సారా రావడానికి రీజన్ వేరే ఉందని అంటున్నారు నెటిజన్స్. శుబ్‌మన్ గిల్ కోసమే ఆమె గబ్బాలో వాలిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్ననే గిల్ ఫ్యామిలీ బ్రిస్బేన్‌కు వచ్చిందని.. దీంతో సారా కూడా అటెండ్ అయిందని అంటున్నారు. కాగా, గిల్‌తో సారా ప్రేమాయణం నడుపుతోందని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలసి పెద్దగా బయట కనిపించకపోయినా.. ఆ రూమర్లు మాత్రం ఆగడం లేదు.


లవ్ లైఫ్

గిల్ సోదరితో సారా క్లోజ్‌గా ఉండటం, వాళ్ల ఫ్యామిలీతో కలసిపోవడంతో స్టార్ క్రికెటర్‌తో ఆమె రిలేషన్‌లో ఉందనే వార్తలకు మరింత బలం చేకూరింది. గిల్ ఆడుతున్న మ్యాచ్‌కు మాత్రమే అటెండ్ అవడం, ఐపీఎల్‌లోనూ అతడి టీమ్ మ్యాచులకు రావడం, శుబ్‌మన్ ఫ్యామిలీతో గ్యాలరీలో సందడి చేయడం, అతడు బాగా ఆడినప్పుడు ఎంజాయ్ చేయడం లాంటివి దీనికి ఊతం ఇస్తున్నాయి. అయితే రిలేషన్‌షిప్ గురించి ఇప్పటిదాకా అటు గిల్ గానీ ఇటు సారా గానీ రెస్పాండ్ అవ్వలేదు. అలాగని తమ మధ్య ఏమీ లేదని ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో వాళ్లు క్లారిటీ ఇస్తే గానీ అసలు ఏం జరుగుతోందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.


Also Read:

ఆ గొడవ మర్చిపోని సిరాజ్

బుమ్రాను భయపెట్టిన హెడ్

లబుషేన్‌ను వణికించిన తెలుగోడు

For More Sports And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 12:15 PM