Mitchell Marsh: మిచెల్ మార్ష్ అద్భుతం.. గాల్లో పక్షిలా ఎగురుతూ పట్టేశాడు
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:19 PM
Mitchell Marsh: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుతం చేశాడు. కళ్లుచెదిరే క్యాచ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ బాల్‌ను పట్టేశాడు.
IND vs AUS: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తోపు బ్యాటరే కాదు.. మంచి బౌలర్ కూడా. తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో కంగారూలకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందిస్తూ వచ్చాడు. అయితే మార్ష్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు మంచి ఫీల్డింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ప్రశంసలు అందుకున్న మార్ష్.. తాజాగా కళ్లుచెదిరే క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో థ్రిల్లింగ్ క్యాచ్ అందుకున్నాడు మార్ష్.
అంత ఈజీగా ఎలా పట్టాడు?
మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్‌కు అవతల ఊరిస్తూ వేసిన బంతికి శుబ్‌మన్ గిల్ ఔట్ అయ్యాడు. మంచి డ్రైవ్‌తో బౌండరీ రాబడదామని అనుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీలోకి వెళ్లింది. అక్కడే కాచుకొని ఉన్న మార్ష్ తన ఎడమ వైపునకు పక్షిలా రివ్వున దూకాడు. వేగంగా వెళ్తున్న బంతిని అద్బుతమైన డైవ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. దీంతో గిల్ ఏం జరుగుతుందో తెలియక బిత్తరపోయాడు. అంత క్లిష్టమైన క్యాచ్‌ను ఈజీగా ఎలా అందుకున్నాడని షాక్ అయ్యాడు. కాగా, వర్షం వల్ల మ్యాచ్‌కు పదే పదే అంతరాయం ఏర్పడుతోంది. మూడో రోజు చివరి సెషన్ మొదలయ్యే నాటికి భారత్ 4 వికెట్ల నష్టానికి 48 పరుగులతో ఉంది.
Also Read:
జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్
పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..
భారత్‌దే జూనియర్ హాకీ ఆసియా కప్
For More Sports And Telugu News