Share News

Mohammed Shami: సానియా మిర్జాతో పెళ్లి వార్తలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన షమీ

ABN , Publish Date - Jul 20 , 2024 | 02:55 PM

టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్నాళ్ల క్రితం జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని షమీతో పాటు...

Mohammed Shami: సానియా మిర్జాతో పెళ్లి వార్తలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన షమీ

టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని (Sania Mirza) టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్నాళ్ల క్రితం జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని షమీతో పాటు సానియా తండ్రి ఖండించినప్పటికీ.. రూమర్లకు మాత్రం చెక్ పడట్లేదు. ముఖ్యంగా.. ట్రోలర్లు దీనిని ఈ అంశాన్ని రబ్బర్‌ను సాగదీసినట్టు లాగుతూనే ఉన్నారు. దీంతో.. షమీ మరోసారి రంగంలోకి దిగి స్పందించాల్సి వచ్చింది. ఈసారి కేవలం క్లారిటీ ఇవ్వడమే కాదు.. ట్రోలర్లను హెచ్చరించాడు కూడా!


Read Also: గంభీర్, కోహ్లీ కలిసి పని చేస్తారా?

ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై షమీ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా ఎంతో విడ్డూరమైంది. నేను ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. ఇలాంటి వార్తలతో పాటు నా ఫోటోలే కనిపిస్తున్నాయి. మీమ్స్ అనేవి సరదా కోసం చేస్తారన్న సంగతి తెలుసు. కానీ.. అవి ఒకరిని బాధపెట్టేలా ఉండకూడదు. కాబట్టి.. మీమ్స్ చేసేముందు ఒకసారి పునరాలోచనలు చేసుకోండి. ఇటువంటి అసత్య ప్రచారాల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి నాదొక హెచ్చరిక. తప్పుడు ప్రచారం చేయాలనుకుంటే.. వెరిఫైడ్ ఖాతాల నుంచి పోస్టులను షేర్ చేయండి. అప్పుడు నేను అందుకు సరైన సమాధానం ఇస్తా. మరొకరి విషయంలో జోక్యం చేసుకోవడం అనేది సులభమే. కానీ.. అలా చేయడం కన్నా జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నించండి. ఉన్నస్థాయికి ఎదగండి. అప్పుడే మీరు మంచి వ్యక్తి అని భావిస్తాను’’ అని చెప్పాడు.


Read Also: సూర్యను కెప్టెన్‌ చేయాలని అడగలేదు.. కానీ!

అయినా.. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఏమొస్తుందని షమీ ప్నశ్నించాడు. కొందరిని టార్గెట్ చేసుకొని.. ఉద్దేశపూర్వకంగా ఈ మీమ్స్ చేస్తున్నట్టు అనిపిస్తోందని మండిపడ్డాడు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ఏదైనా ఒక వార్తను షేర్ చేయడానికి ముందు అది సరైందా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని కోరాడు. ఇలాంటి చెత్త న్యూస్‌లను ప్రచారం చేయడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటువంటి మీమ్స్ వల్ల కచ్ఛితంగా ఒకరు బాధపడతారని పునరుద్ఘాటించాడు. కాగా.. షమీ, సానియా ఇద్దరూ తమతమ భాగస్వాములకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లు సింగిల్‌గా లైఫ్‌నీ లీడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుంటున్నారని పుకార్లు పుట్టించగా.. షమీ పై విధంగా సీరియస్ అయ్యాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 02:55 PM