Share News

Nitish Kumar Reddy: టీమిండియాకి నయా సలార్.. వాళ్లు మూటాముళ్లె సర్దుకోవాల్సిందే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 08:16 PM

Boxing Day Test: టీమిండియాలోకి నయా సలార్ వచ్చేశాడు. ఒక్క సిరీస్‌తోనే జట్టుకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందించాడు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చాడు. భారత్‌కు తాను ఉన్నానంటూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆదుకుంటూ ఫ్యూచర్ స్టార్ తానే అని ప్రూవ్ చేశాడు.

Nitish Kumar Reddy: టీమిండియాకి నయా సలార్.. వాళ్లు మూటాముళ్లె సర్దుకోవాల్సిందే..
Nitish Kumar Reddy

IND vs AUS: పేరుకే స్టార్లు. వరుసగా విఫలమైనా ఎవ్వరూ ఏమీ అనరు. సోషల్ మీడియాలోని నెటిజన్స్ నుంచి బయటి క్రిటిక్స్ వరకు ఎవ్వరెంత గొంతు చించుకొని అరిచినా పట్టించుకోరు. ఎన్ని విమర్శలు చేసినా డోన్ట్ కేర్ అన్నట్లే ఉంటారు. వరుసగా ఫెయిల్ అవుతున్నా జిడ్డుగా టీమ్‌ను పట్టుకొని ఉంటారు. సెలెక్టర్ల అండదండలా? లేదా టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్టా? బీసీసీఐ పెద్దల మద్దతా? తెలియదు గానీ ఎన్ని జరిగినా టీమ్‌ను మాత్రం పట్టుకొని వేలాడుతుంటారు. రవిచంద్రన్ అశ్విన్ లాంటి నిజాయితీ ఉన్న క్రికెటర్లు పక్కన జరగాలే గానీ వీళ్లు మాత్రం అస్సలు తప్పుకోరు. ఇదీ టీమిండియాలోని కొందరు సీనియర్ల గురించి ఎక్కువగా వినిపించే అభిప్రాయం. ఇన్నాళ్లూ ఎలాగోలా నెట్టుకొస్తున్న వారు ఇక పక్కకు జరగాల్సిన టైమ్ వచ్చేసినట్లే ఉంది. దానికి టీమిండియాలోకి నయా సలార్ రాకే కారణమని విశ్లేషకులు అంటున్నారు.


పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్!

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. అయిపోయిందేదో అయిపోయింది.. ఇకనైనా మూట సర్దుకోండి. కొత్త సలార్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చేశాడు.. ఇంక మీ అవసరం టీమ్‌కు లేదు అనే అభిప్రాయాలు నెట్టింట వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెల్‌బోర్న్ టెస్ట్‌లో నితీష్ ఆడిన స్టన్నింగ్ నాక్, సెంచరీ కొట్టిన తీరు, కంగారూ బౌలర్లను ఎదుర్కొన్న విధానం చూసి ఇంక భారత జట్టు.. యువ రక్తానిదే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అశ్విన్‌కు సుందర్ రీప్లేస్‌మెంట్ అని.. రోహిత్-కోహ్లీ లాంటి వారికి జైస్వాల్-నితీష్ ప్రత్యామ్నాయం అని అంటున్నారు.


ఒక్క సెంచరీతో హీరోనా?

నితీష్ తోడుగా జైస్వాల్‌, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సుందర్ ఇతర యంగ్‌స్టర్స్‌ను తీసుకొని వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2027 కోసం టీమ్‌ను తయారు చేయడంపై భారత సెలెక్టర్లు దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ సూచిస్తున్నారు. ఒక్క సెంచరీతో నితీష్ సలార్ అయిపోతాడా.. జట్టుకు అతడే పెద్ద దిక్కు అని ఎలా చెబుతారనే ప్రశ్నలకు కూడా దీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ సిరీస్ మొత్తం అతడే అద్భుతంగా ఆడాడని.. హయ్యెస్ట్ స్కోరర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్-2024లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అతడికే దక్కిందని గుర్తుచేస్తున్నారు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు చాలని.. నితీష్ టాలెంట్ ఏంటో ప్రపంచం మొత్తం గుర్తించిందని.. బీసీసీఐ కూడా ఆ పని చేస్తే ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇంత స్ట్రోక్ ప్లే, సాలిడ్ డిఫెన్స్, అటాకింగ్ అప్రోచ్, అగ్రెషన్, ఫియర్‌లెస్‌నెస్ ఉన్న మరో ప్లేయర్ జట్టులో లేడని.. నితీషే రియల్ సలార్ అని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడొక్కడు 100 మందితో సమానమని.. సరైన అవకాశాలు ఇస్తూ బ్యాకప్ చేస్తే ఏడాదిలో నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడుతున్నారు.


Also Read:

సిరాజ్ డాట్ బాల్.. దద్దరిల్లిన స్టేడియం.. మియా మ్యాజిక్ అంటే

ఒక్క ఇన్నింగ్స్‌తో 5 క్రేజీ రికార్డులు బ్రేక్.. ఇదీ తెలుగోడి దెబ్బ

తండ్రినే కాదు.. మొత్తం స్టేడియాన్ని ఏడిపించాడు..

నితీష్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.. గర్వపడేలా

For More Sports And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 08:21 PM