Share News

Travis Head: సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 02:44 PM

Travis Head: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు హెడ్. సెంచరీతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు.

Travis Head: సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..

IND vs AUS: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు హెడ్. ధనాధన్ సెంచరీతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. టెస్టుల్లో టీ20 తరహా బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. డిఫెన్స్ కంటే అటాకింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించిన హెడ్.. మంచి బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. క్రీజులో సెటిల్ అయ్యాక వాటిని కూడా భారీ షాట్లుగా మలిచాడు. ఈ క్రమంలో 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు హెడ్. అయితే మూడంకెల మార్క్‌ను అందుకున్నాక అతడు విచిత్రంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.


వారసుడి కోసం..

సెంచరీ పూర్తవగానే తన స్టైల్‌లో హెల్మెట్ తీసి బ్యాట్ మీద పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు హెడ్. అలాగే బ్యాట్‌ను రెండు చేతుల్లో పట్టుకొని చిన్న పిల్లల్ని గారాబం చేస్తున్న మాదిరిగా అటూ ఇటూ ఊపాడు. దీంతో అతడు ఎందుకిలా చేశాడనేది చాలా మందికి అర్థం కాలేదు. హెడ్ సెలబ్రేషన్‌కు అర్థం ఏంటని తెలుసుకోసాగారు. అయితే అతడు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. నవంబర్ 4వ తేదీన హెడ్‌కు కుమారుడు జన్మించాడు. అతడికి హారిసన్ అని నామకరణం చేశారు. బిడ్డ పుట్టాక కొట్టిన సెంచరీ కావడంతో హెడ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో గ్రౌండ్‌లో అతడి భార్య జెస్సికా డేవిస్‌తో పాటు వారసుడు హారిసన్ కూడా ఉన్నారు.


మ్యాజిక్ చేస్తారా?

హెడ్ సెంచరీని అతడి ఫ్యామిలీ కూడా సెలబ్రేట్ చేసుకుంది. స్టేడియంలోని అభిమానులు కూడా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇక, అడిలైడ్ టెస్ట్ విషయానికొస్తే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 9 వికెట్లకు 332 పరుగులతో ఉంది. కంగారూల ఆధిక్యం 152 పరుగులకు చేరుకుంది. టీమిండియా నెగ్గాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయక తప్పదు. కనీసం 350 పైచిలుకు లక్ష్యం ఇస్తే గెలిచే ఛాన్స్ ఉండదు. గెలవాలన్నా, ఓటమి నుంచి తప్పించుకోవాలన్నా అంతా బ్యాటర్ల చేతుల్లోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఫ్లాప్ అయిన మన బ్యాటింగ్ యూనిట్ రెండో ఇన్నింగ్స్‌లోనైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.


Also Read:

ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

For More Sports And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 02:47 PM