Share News

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో ఫిక్సింగ్.. ఓ ఆటగాడిని సంప్రదించి..

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:38 PM

‘మ్యాచ్ ఫిక్సింగ్’.. కొన్ని దశాబ్దాల నుంచి క్రికెట్‌ని పట్టి పీడిస్తున్న పెను భూతం ఇది. దీనిని అంతం చేసేందుకు ఐసీసీ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోంది.

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో ఫిక్సింగ్.. ఓ ఆటగాడిని సంప్రదించి..
Uganda Player Approached Mysterously For Fixing

‘మ్యాచ్ ఫిక్సింగ్’ (Match Fixing).. కొన్ని దశాబ్దాల నుంచి క్రికెట్‌ని పట్టి పీడిస్తున్న పెను భూతం ఇది. దీనిని అంతం చేసేందుకు ఐసీసీ ఎన్ని కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోతోంది. డబ్బుల కోసం స్వయంగా ఆటగాళ్లే అమ్ముడుపోవడమో లేదా తమ జట్టుని గెలిపించుకోవడం కోసం బుకీలు రంగంలోకి దిగడమో జరుగుతూనే ఉంది. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లోనూ (T20 World Cup) ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు తెలియని నంబర్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయంటూ.. ఓ ఉగాండా (Uganda) ఆటగాడు ఐసీసీకి (ICC) ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.


Read Also: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత ప్రవర్తన.. స్టేజ్‌పై..

తనను కొంతమంది బుకీలు సంప్రదించారని, ముఖ్యంగా కెన్యాకు (Kenya) చెందిన ఓ ఆటగాడు పలే పదే ఫోన్లు చేశాడని ఉగాండా ప్లేయర్ తెలిపాడు. దీంతో.. ఐసీసీ యాంటీ-కరప్షన్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌కప్ లీగ్ దశలో.. గయానాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెన్యా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆ ఉగాండా ప్లేయర్‌కు వేర్వేరు నంబర్ల నుంచి సంప్రదించినట్లు తెలిసింది. ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించిన కెన్యా మాజీ ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ టీమ్‌లను ఐసీసీ అప్రమత్తం చేసింది. మరోవైపు.. తనకు ఆఫర్ వచ్చిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా, ICC అవినీతి నిరోధక ప్రోటోకాల్‌ను అనుసరించినందుకు గాను ఉగాండా ప్లేయర్‌ను మెచ్చుకున్నారు.


Read Also: టీ20 క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్.. కేవలం 27 బంతుల్లోనే సెంచరీ

ఈ వ్యవహారంపై ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ.. కెన్యా మాజీ ప్లేయర్ ఉగాండా జట్టు ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఎందుకంటే.. పెద్ద జట్ల కన్నా చిన్న జట్లను టార్గెట్ చేయడం సులభమని, చిన్న జట్ల ఆటగాళ్లను డబ్బులు తక్కువగా అందుతాయి కాబట్టి వారిని మభ్యపెట్టొచ్చని చెప్పారు. అయితే.. ఆ ఉగాండా ఆటగాడు ఐసీసీకి తెలియజేసి మంచి పని చేశాడని అన్నారు. ఇదిలావుండగా.. ఉగాండా జట్టు టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌తో ఈ టోర్నీని ప్రారంభించింది. ఆ మ్యాచ్‌లో గెలుపొందింది కానీ, ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో.. సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 05:57 PM