Virat Kohli: గాయపడిన సింహం.. కోహ్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:24 PM
ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు గర్జించింది. తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ ను 1-1తో సమం చేసిన ఆసిస్ మూడో టెస్టును కూడా గెలిచి ఆధిక్యంలో నిలిచేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు రెండో టెస్టు నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా కోహ్లీ మూడో టెస్టు కోసం కొత్త స్ట్రాటెజీని వాడుతున్నట్టు తెలుస్తోంది.
పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఆస్ట్రేలియాతో రెండో టెస్టులోనూ రాణించలేకపోయాడు. దీంతో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే టైమొచ్చిందంటూ అతడి హేటర్స్ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలన్నింటికీ ఒకే వేదికపై సమాధానం చెప్పాలని కోహ్లీ ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ తెలియజేశాడు. గతంతో పోలిస్తే కోహ్లీ నెట్ సెషన్ ప్రాక్టీస్ లో భారీ మార్పులను గమనించినట్టు తెలిపాడు.
కోహ్లీ అతడి బ్యాక్ ఫూట్ డిఫెన్స్ ను పరిశీలించుకుంటున్నాడు. బౌన్స్ ఉన్న పిచ్ ను ఎదుర్కొనేందుకు మరింత శ్రమిస్తున్నాడు. గబ్బా పిచ్ అందించే బౌన్స్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. అతడొక ఫ్రంట్ ఫూట్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. ఇక్కడి పిచ్ లపై ఆడాలంటే ఫ్రంట్ ఫూట్ తెలిసుండాలి. రికీ పాంటింగ్, స్టీవ్ వా, లాంగర్, హేడెన్ వంటి ఆటగాళ్లు ఇలాగే రాణించగలిగారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ ను ఎదుర్కోవడం ఎలాగో తెలిసుండాలి.
ఈరోజు కోహ్లీ ఆడటాన్ని నేను చూశాను. బ్యాక్ ఫూట్ తో లెక్కకు మించి డెలివరీలను అతడు ఆడుతున్నాడు. అతడు ఫుల్లర్ బాల్స్ తో ఆడేందుకు ఇష్టపడుతున్నాడు. కానీ, బంతులు షార్ట్ గా ఉండటం వల్ల కష్టపడుతున్నాడు. గబ్బా లో బౌన్స్, పేస్ ఎంత ముఖ్యమో కోహ్లీకి బాగా తెలుసు. అందుకే అతడు బ్యాక్ ఫూట్ ఆడటం కూడా ఎంతో అవసరం. అతడు ఆటపై మరింత దృష్టి పెట్టడం చూస్తే సంతోషంగా ఉంది. పరాజయం పలకరించిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగిసే కోహ్లీని మనం ఎన్నో సార్లు చూశాం అని హర్బజన్ తెలిపాడు.