Share News

MS Dhoni: ``తలా ఫర్ ఏ రీజన్``.. రొనాల్డోకు ధోనీతో పోలిక.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఫిఫా!

ABN , Publish Date - Jun 19 , 2024 | 02:16 PM

భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు మహేంద్ర సింగ్ ధోనీ ఓ లెజెండ్. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనమైన నాయకుడు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

MS Dhoni: ``తలా ఫర్ ఏ రీజన్``.. రొనాల్డోకు ధోనీతో పోలిక.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఫిఫా!
Cristiano Ronaldo, MS Dhoni

భారత క్రికెట్‌కు సంబంధించినంత వరకు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఓ లెజెండ్. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనమైన నాయకుడు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత కూడా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఫిఫా (FIFA) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ధోనీ క్రేజ్‌ను మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo). ప్రపంచ ప్రముఖ క్రీడాకారుల జాబితాలో రొనాల్డో పేరు ముందు వరుసలో ఉంటుంది.


రొనాల్డో ప్రస్తుతం యూరో కప్ (Euro Cup) ఆడడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రీడా అభిమానులను ఆకర్షించేందుకు ఫిఫా ఓ పోస్ట్ చేసింది. ధోనీతో రొనాల్డోను పోల్చుతూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ చేసింది. ``తలా ఫర్ ఏ రీజన్ 7`` (Thala for a reason) అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై అభిమానులు ధోనీని ``తలా ఫర్ ఏ రీజన్`` అని పిలుచుకుంటున్నారు. అంటే ``లీడర్ ఫర్ ఏ రీజన్`` అని అర్థం. టీమిండియా తరఫున, చెన్నై టీమ్ తరఫున ఎన్నో విజయాలు సాధించిన ధోనీని ఈ టైటిల్‌తో గౌరవిస్తుంటారు.


తాజాగా అదే టైటిల్‌ను రొనాల్డోకు తగిలిస్తూ ఫిఫా చేసిన పోస్ట్ భారత అభిమానులను ఆకట్టుకుంటోంది. మరో విశేషమేమిటంటే.. రొనాల్డో, ధోనీ.. ఇద్దరూ ``7`` నెంబర్‌ ఉన్న జెర్సీలతోనే ఆడతారు. నిజానికి భారత్‌లో ఫుట్‌బాల్‌ను చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు. ఇలాంటి పోస్ట్‌లతో భారత క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు ఫిఫా ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Surya kumar Yadav: రెండేళ్లుగా నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌‌గా ఉన్నా.. ఎలా ఆడాలో తెలుసు.. సూర్య కుమార్ కీలక వ్యాఖ్యలు!


WV Raman: భారత్ చీఫ్ కోచ్ పదవికి గంభీర్‌తో పోటీ పడుతున్న రామన్ ఎవరు?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2024 | 03:52 PM