Viral Video: మరో రికార్డు బ్రేక్ చేసిన ఎంఎస్ ధోని
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:28 AM
ఎంస్ ధోని(MS Dhoni) అభిమానులు(fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే 42 ఏళ్ల వచ్చినా కూడా తన ఆటలో మాత్రం జోరు తగ్గలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఐపీఎల్ 2024(ipl 2024) ఆర్సీబీ(RCB), సీఎస్‌కే(CSK) మ్యాచులో ధోని అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
ఎంస్ ధోని(MS Dhoni) అభిమానులు(fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే 42 ఏళ్ల వచ్చినా కూడా తన ఆటలో మాత్రం జోరు తగ్గలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఐపీఎల్ 2024(ipl 2024) ఆర్సీబీ(RCB), సీఎస్‌కే(CSK) మ్యాచులో ధోని అరుదైన ఘనతను దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా ధోనీ పరుగులు కాపాడడమే కాకుండా రెండు అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ఐదో ఓవర్‌లో రజత్ పాటిదార్, ఆరో ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ వికెట్ వెనుక అద్భుతమైన క్యాచులు పట్టాడు.
దీని తర్వాత చివరి ఓవర్లో అనుజ్ రావత్‌ను రనౌట్(run out) చేశాడు. అయితే చివరి బంతికి దినేష్ కార్తీక్(dinesh karthik) కవర్ డ్రైవ్ వైపునకు ఆడేందుకు ప్రయత్నించి మిస్ అయ్యాడు. అంతేకాదు ఆ క్రమంలో బై రన్ కూడా తీయాలని ముందుకెళ్లాడు. ఆ క్రమంలోనే క్రీజులోకి అటు నుంచి వచ్చిన అనూజ్ రావత్(Anuj Rawat)ను వికెట్ వెనుక ఉన్న ధోని వెంటనే రియాక్ట్ అయ్యి బంతిని పట్టుకుని నేరుగా స్టంప్‌లకు కొట్టాడు. దీంతో అనూజ్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
ఈ మ్యాజిక్ చూసిన అభిమానులు(fans) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్(viral video) అవుతోంది. అంతేకాదు ఈ రన్ అవుట్ ద్వారా ధోని సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. దీంతో ఐపీఎల్లో అత్యధిక రన్ అవుట్లు(24) చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. దీనికి ముందు రవీంద్ర జడేజా(23)తో సమానంగా ఉండగా, ఇప్పుడు అధిగమించాడు.
మరోవైపు ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీని విడిచిపెడుతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad)కు జట్టు కెప్టెన్‌గా ఇచ్చారు. కానీ మ్యాచ్ సమయంలో కూడా ధోని నాయకత్వం స్పష్టంగా కనిపించింది. అతను ఫీల్డింగ్‌ను కూడా సెట్ చేశారు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 173 పరుగులు చేయగా, చెన్నై ఆ లక్ష్యా్న్ని ఈజీగా అధిగమించి విజయం సాధించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేడు మధ్యాహ్నం PBKS vs DC మ్యాచ్.. మరి ఎవరు గెలుస్తారు?