BCCI: పదవి కోసం ఆకతాయి పనులు.. బీసీసీఐలో పదవి కోసం మోదీ, ధోని, సచిన్ పేరుతో దరఖాస్తులు
ABN , Publish Date - May 28 , 2024 | 01:25 PM
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మే నెల మొదటి వారం నుంచే బీసీసీఐ(BCCI) దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. బీసీసీఐ వెబ్‌సైట్‌లో గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన తరువాత ఇప్పటివరకు 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మే నెల మొదటి వారం నుంచే బీసీసీఐ(BCCI) దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. బీసీసీఐ వెబ్‌సైట్‌లో గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన తరువాత ఇప్పటివరకు 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే పదవి దక్కాలనే కాంక్షతో కొందరు ఆకతాయిలు ఏకంగా ప్రముఖుల పేర్లను వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడం ప్రారంభించారు.
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి ప్రముఖుల పేర్లను దరఖాస్తుల్లో ఉపయోగించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను బీసీసీఐ జల్లెడ పడుతోంది. బీసీసీఐకి ఇలాంటి ఫేక్ అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారి కాదు.
2022లో బీసీసీఐ చీఫ్ పోస్టుల కోసం అప్లికేషన్లు ఆహ్వానించినప్పుడు దాదాపు 5 వేల దరఖాస్తులు అందాయి. వీటిలో చాలా వరకు ఫేక్‌వే ఉన్నాయి.అయితే, ఈసారి కూడా బీసీసీఐ పాత తప్పునే చేసింది. గూగుల్ ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపమని చెప్పడంతో 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు మే 27తో ముగిసింది.
అర్హతలు..
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 ODI మ్యాచ్‌లు ఆడి ఉండాలి.
లేదా పూర్తి సభ్యుడిగా ఉన్న టెస్ట్ ఆడే దేశానికి కనీసం 2 ఏళ్లు ప్రధాన కోచ్‌గా ఉండాలి.
లేదా ఏదైనా అసోసియేట్ మెంబర్ టీమ్/IPL టీమ్, ఫస్ట్ క్లాస్ టీమ్, ఏదైనా దేశం 3 సంవత్సరాలు జట్టు కోచ్‌గా ఉండాలి.
బీసీసీఐ లెవెల్-3 కోచింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 60 ఏళ్ల లోపు ఉండాలి. ఇలా బీసీసీఐ వివిధ నిబంధనలు విధించింది.
ఎంపిక ఇలా..
టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు చెక్ చేశాక, బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ(CAC) అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూ చేస్తుంది. BCCI ఈ ఇంటర్వ్యూ పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. కోచ్ పదవికి అర్హులెవరనేది కూడా సిఫార్సు చేస్తుంది. బీసీసీఐ సిఫార్సును సమీక్షించి చివరి నిర్ణయం తీసుకుంటుంది.
Read Latest News and Sports News here..