Share News

Mumbai: హైదరాబాద్ హలీమ్‌కు సచిన్ టెండూల్కర్ ఫిదా..

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:24 PM

హలీమ్.. అందులోనూ హైదరాబాద్ హలీమ్. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. లొట్టలేసుకుని తినడమైతే పక్కా. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు క్షణాల్లో ఆరగించేస్తారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా హైదరాబాద్ హలీమ్‌ ప్రేమలో పడిపోయాడు.

Mumbai: హైదరాబాద్ హలీమ్‌కు సచిన్ టెండూల్కర్ ఫిదా..

ముంబై: హలీమ్.. అందులోనూ హైదరాబాద్ హలీమ్. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. లొట్టలేసుకుని తినడమైతే పక్కా. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు క్షణాల్లో ఆరగించేస్తారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూడా హైదరాబాద్ హలీమ్‌ ప్రేమలో పడిపోయాడు.

ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సతీమణి సఫా బేగ్ చెప్పారు. ఈ మధ్యే సఫా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాలను చేస్తూ.. పాక శాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వీడియోలు చేస్తుంటారు సఫా. ఈ మధ్య ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో "ఆస్క్ మి ఎనీథింగ్" సెషన్‌ని నిర్వహించింది.


Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు

అందులో ఓ అభిమాని "సచిన్ టెండూల్కర్ కోసం ఏమైనా వండి పెట్టారా" అని అడిగాడు. సఫా ఆ ప్రశ్నకు బదులిస్తూ.. "హైదరాబాద్ హలీమ్‌ని వండి సచిన్, అంజలి టెండూల్కర్‌లకు పంపాను. అది తిన్న వారు హలీమ్‌తో ప్రేమలో పడిపోయారు. చాలా రుచిగా ఉందని బదులిస్తూ.. మర్చిపోలేని అనుభూతిని పొందారు. వాళ్ల ఫ్యామిలీ కూడా హైదరాబాద్ స్పెషల్ హలీమ్‌కు ఫిదా అయిపోయింది" అని సఫా చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌కు చెందిన సఫా.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో పెరిగారు. ఆమె హైదరాబాదీ వంటలు చేయడంలో నిష్ణాతురాలు. పవిత్ర రంజాన్ మాసంలో సంప్రదాయక వంటకంగా వండే హలీమ్ ఏడాది పొడవునా ప్రజాదరణ పొందుతోంది. ప్రస్తుతం నగరంలోని అనేక హోటల్లలో అన్నివేళలా అందుబాటులో ఉంటోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 12:26 PM