Share News

Kuwait Building Fire: టీవీ కేబుల్ ప్రాణాలను కాపాడింది!

ABN , Publish Date - Jun 14 , 2024 | 07:25 AM

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన గంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను కువైత్‌లోని అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటనకు సంబంధించి వివరాలను అతను ఆంధ్రజ్యోతికి వివరించాడు.

Kuwait Building Fire: టీవీ కేబుల్ ప్రాణాలను కాపాడింది!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌ (Kuwait)లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) నుంచి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య (Kotte Gangaiah) ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను కువైత్‌లోని అదన్ ఆసుపత్రి (Adan Hospital)లో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటనకు సంబంధించి వివరాలను అతను ఆంధ్రజ్యోతికి (Andhrajyothy) వివరించాడు.


బుధవారం తెల్లవారు జామున అర్తనాదాలు వినిపిస్తున్నాయని, చిమ్మచీకటిలో ఏమి కనిపించలేదని, ఏమవుతుందో అర్ధం కావడం లేదని కొట్టె గంగయ్య అన్నాడు. కానీ ఘూటుగా వస్తున్న పొగ వాసన వలన అగ్ని ప్రమాదం జరిగిందని అర్ధమయిందని, అందరు పారిపోతున్నారని వివరించాడు. తాను ఉంటున్న రెండవ ఆంతస్ధులోని కిటికీల నుంచి అందరు కిందకు దూకారని కానీ తాను సాహసించలేదని చెప్పాడు.


బుధవారం తెల్లవారు జామున అర్తనాదాలు వినిపిస్తున్నాయని, చిమ్మచీకటిలో ఏమి కనిపించలేదని, ఏమవుతుందో అర్ధం కావడం లేదని కొట్టె గంగయ్య అన్నాడు. కానీ ఘూటుగా వస్తున్న పొగ వాసన వలన అగ్ని ప్రమాదం జరిగిందని అర్ధమయిందని, అందరు పారిపోతున్నారని వివరించాడు. తాను ఉంటున్న రెండవ ఆంతస్ధులోని కిటికీల నుంచి అందరు కిందకు దూకారని కానీ తాను సాహసించలేదని చెప్పాడు. ఏమి కనిపించని తనకు అనుకోకుండా గోడ తగిలిందని దాన్ని తాక్కొంటూ చివరి వరకు చేరుకోని కింద మెట్లను తాకి చూసి మెళ్ళిగా కిందకు దిగి అక్కడ చూస్తే కొంత వెలుతురు కనిపించిందని, అక్కడ నుంచి ఒక గదిలో ప్రవేశించి అవతలి వైపు నుండి కనిపిస్తున్న టివి కేబుల్ సహాయంతో కొంత దూరం క్రిందకు దిగి అక్కడి నుండి పార్కింగ్ షెడ్డు పై దూకినట్లుగా గంగయ్య తెలిపాడు.


ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ గంగన్నను మిగిలిన క్షత్రగాత్రులతో పాటు అదన్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గంగన్నతో పాటు మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన దేవరాజం, రాజన్న, సిరిసిల్లా జిల్లాకు చెందిన ఆశోక్‌లు కూడ కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. కాగా గంగన్నను గురువారం ఉదయం విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కిర్తీ వర్ధన్ సింగ్ పరామర్శించారు.


పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయకష్టం చేసి, ఆదమరిచి సేదతీరుతున్న వారిలో 35 మంది భారీ అగ్నిప్రమాదంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. పొగతో ఉక్కిరిబిక్కిరై కొందరు.. పైఅంతస్తుల నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు.. ఇలా 50 మంది గాయాలపాలవ్వగా వారిలో 15 మంది ఆస్పత్రిలో కన్నుమూశారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కువైట్‌లోని మంగఫ్‌ మునిసిపాలిటీ పరిధిలోని ఎన్‌బీటీసీ గ్రూప్‌ భవనంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్‌బీటీసీ కంపెనీలో పనిచేసేవారంతా మలయాళీలు, తమిళులే..! వీరికి వసతి కల్పించేందుకు కువైట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భవనాలను నిర్మించారు. మంగాఫ్‌ నగరంలోని ఆరంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తున్నారు. కువైట్‌లోని భారతీయులు ఈ భవనాన్ని ‘మలయాళీ క్యాంపు’గా పిలుస్తారు. కువైట్‌ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ఎన్‌బీటీసీ కార్మికులు నివసించే భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వంటగదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో.. క్షణాల్లో మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయి.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం 6 గంటల వేళ మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనాస్థలిలో 35 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకి గాయాలైన వారు, దట్టమైన పొగతో శ్వాస ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు.. ఇలా మొత్తం 50 మందిని అల్‌-అదాన్‌, అల్‌-ఫర్వానియా, అల్‌-అమీరి, అల్‌-ముబారక్‌, అల్‌-జాబెర్‌ ఆస్పత్రులకు తరలించినట్లు ఆయన వివరించారు. వీరిలో 15 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మిగతా 35 మంది క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందజేస్తున్నట్లు వివరించారు. బాధితుల్లో చాలా మంది దట్టమైన పొగను పీల్చడం వల్ల మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్‌ స్వైకా సంఘటనాస్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎంబసీ హెల్ప్‌లైన్‌ +965 65505246ను సంప్రదించవచ్చన్నారు.

Updated Date - Jun 14 , 2024 | 08:25 AM