BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్... మరో కీలక నేత గుడ్‌బై..!
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:44 AM
కాంగ్రెస్‌లో కౌన్సిలర్‌గా గెలిచి, బడంగ్‌పేట్ నగర పంచాయతీకి నాలుగేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించి.. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ‘అవిశ్వాసం’తో పదవి కోల్పోయిన మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు సామ నర్సింహగౌడ్(Sama Narsimha Goud) హస్తం గూటికి చేరనున్నారు.
- నేడో రేపో కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్‌లో కౌన్సిలర్‌గా గెలిచి, బడంగ్‌పేట్ నగర పంచాయతీకి నాలుగేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించి.. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ‘అవిశ్వాసం’తో పదవి కోల్పోయిన మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు సామ నర్సింహగౌడ్(Sama Narsimha Goud) హస్తం గూటికి చేరనున్నారు. బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. నేడో రేపో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి(Former MLA Thigala Krishna Reddy) ఆధ్వర్యంలో సీఎం సమక్షంలోగానీ, నియోజకవర్గం ఇన్‌చార్జి కేఎల్లార్ సమక్షంలోగానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదికూడా చదవండి: Hyderabad: కిలోమీటరు ఊడ్చితే రూ.3.21 లక్షలట!
మొన్నటిదాకా బీఆర్‌ఎస్(BRS) నాయకుడిగా, తీగల కృష్ణారెడ్డి అనుచరుడిగా కొనసాగిన ఆయన.. ఇటీవల ‘తీగల’ కారు దిగి హస్తం గూటికి చేరడంతో.. తాను సైతం ‘కారు’ దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం మీర్‌పేట్‌లోని టీకేఆర్ కాలేజీలో తీగలతో మంతనాలు జరిపిన సామ.. ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పాలని తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News