Share News

CM Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:28 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి.

CM Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై  సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!
CM Revanth Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?


ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని చెప్పారు. కాగా.. ఈ కేసులో మే 1న హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Ponnala Laxmaiah: 1.85 శాతం ఓట్లతో ఓడిపోయిన బీఆర్‌ఎస్ చచ్చిన పాము ఎలా అవుతుంది?

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 29 , 2024 | 05:59 PM