Share News

Public Health: డెంగీ పాజిటివ్‌ రేటు తగ్గింది:దామోదర

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:42 AM

తెలంగాణలో డెంగీ పాజిటివ్‌ రేటు తగ్గిందని, వ్యాప్తి తీవ్రతను అదుపులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Public Health: డెంగీ పాజిటివ్‌ రేటు తగ్గింది:దామోదర

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డెంగీ పాజిటివ్‌ రేటు తగ్గిందని, వ్యాప్తి తీవ్రతను అదుపులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వారం క్రితం వరకు 7 శాతం ఉన్న పాజిటివ్‌ రేటు ప్రస్తుతం 6 శాతానికి వచ్చిందన్నారు. దీన్ని మరింత తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.


రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గే వరకు వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వవద్దని, ప్రతీ ఒక్కరూ విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ డాక్టర్‌ వాణి, టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, డీహెచ్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య 6,242కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,06,356 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా, అందులో పాజిటివ్‌ రేటు 6 శాతంగా నమోదయిందని తెలిపింది.

Updated Date - Sep 01 , 2024 | 03:42 AM