Share News

Jogipet: ఇది వాయిదాల సర్కార్‌

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:09 AM

రాష్ట్రంలోని సర్కారు వాయిదాల మీద నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Jogipet: ఇది వాయిదాల సర్కార్‌

  • రేవంత్‌ హయాంలో అటకెక్కిన ప్రభుత్వ పథకాలు

  • ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు

జోగిపేట, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సర్కారు వాయిదాల మీద నడుస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా అందోలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అలయ్‌బలయ్‌ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని వాయిదా వేస్తూ వాయిదాల ప్రభుత్వంగా కాంగ్రెస్‌ సర్కార్‌ పేరు గాంచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో ఒక్క ఉచిత బస్సు తప్ప కొత్తగా ఒక్క పథకమూ ప్రారంభం కాకపోగా, బీఆర్‌ఎస్‌ కాలంలో అమలు చేసిన పథకాలూ అటకెక్కాయన్నారు. ఎన్నికల సందర్భంగా గతేడాది డిసెంబర్‌ 9 నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌ తీరా గెలవగానే రుణమాఫీని వాయిదా వేయగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తాజాగా ఈ ఏడాది డిసెంబరు 9 నాటికి వాయిదా వేశారని హరీశ్‌ చెప్పారు.


ప్రతీయేటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న రేవంత్‌ గతంలో కేసీఆర్‌ వేసిన నోటిఫికేషన్ల తాలూకు 30 వేల ఉద్యోగాలు తప్ప కొత్తగా ఒక్కటీ ఇవ్వలేదన్నారు. సంవత్సరం గడుస్తున్నా నేటికీ ఇంకా జాబ్‌ కేలెండర్‌ విడుదల చేయలేకపోగా, ఇస్తామన్న నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయడం లేదన్నారు. దసరా వేళ ఆర్టీసి టికెట్‌ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి వసూలు చేయడం దుర్మార్గమని హరీశ్‌రావు విమర్శించారు. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ బస్సుచార్జీ సాధారణ రోజుల్లో రూ.300ఉండగా పండుగ వేళ ప్రభుత్వం రూ.420కి పెంచి ప్రయాణికులనుంచి ముక్కుపిండి వసూలు చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.


  • గురుకులాలను ఉంచుతారా..? ఊడగొడతారా..?

ప్రతి నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థులతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ కడుతున్నామని సీఎం ప్రకటించడంపై అన్ని వర్గాల్లో అయోమయం నెలకొందని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాటా ్లడుతూ గతప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకోసం ఏర్పాటుచేసిన 1023 గురుకులాలను ఉంచుతారా? ఊడగొడతారా? చెప్పాలని ఆయన రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

Updated Date - Oct 15 , 2024 | 04:09 AM