Share News

Hyderabad: ఓ1 వీసాలతోనూ యూఎస్‌లో ఉండొచ్చు..

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:34 PM

తెలంగాణ నుంచి ఎక్కువ మంది హెచ్‌ 1 బీ వీసాలను కోరుకుంటున్నారని యూఎస్‌ అటార్నీ, గెహీ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ ప్రిన్సిపల్‌ ఫౌండర్‌ నరేష్‌ ఎం గెహీ(Naresh M Gehi) తెలిపారు.

Hyderabad: ఓ1 వీసాలతోనూ యూఎస్‌లో ఉండొచ్చు..

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ నుంచి ఎక్కువ మంది హెచ్‌ 1 బీ వీసాలను కోరుకుంటున్నారని యూఎస్‌ అటార్నీ, గెహీ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ ప్రిన్సిపల్‌ ఫౌండర్‌ నరేష్‌ ఎం గెహీ(Naresh M Gehi) తెలిపారు. హైదరాబాద్‌లో తమ సంస్థ శాఖను ఏర్పాటుచేశామని వెల్లడించేందుకు బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ అద్దంకి దయాకర్‌, సోషలైట్‌ సుధా జైన్‌, వర్ధమాన నటులు అభిలాష్‌ సుంకర, లక్ష్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు..


ఈ సందర్భంగా నరేష్‌ ఎం గెహీ మాట్లాడుతూ.. యూఎస్‌ నిబంధనలు అనుసరిస్తూ అక్కడ ఉంటున్న వారికి ఇబ్బంది ఉండదన్నారు. విద్యార్థులు యూఎస్‏లో విద్యనభ్యసించాలనుకుంటే అక్కడి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలలోనే అడ్మిషన్‌లు పొందితే సమస్యలు రావన్నారు. ట్రంప్‌ అధ్యక్ష పదవి అధిష్టిస్తే విద్యార్థులకు కష్టమనేది అపోహ మాత్రమేనన్నారు. హెచ్‌1బీ వీసా తిరస్కరణకు గురైందని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఓ1 వీసాలతోనూ యూఎస్‏లో ఉండొచ్చన్నారు.


సైన్స్‌, కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌ లేదా మోషన్‌ పిక్చర్‌, టెలివిజన్‌ పరిశ్రమలలో ఉండి, తమ ప్రతిభ పరంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే వారు ఓ1 వీసా పొందడానికి అర్హులన్నారు. హెచ్‌1బీ వీసాలకు పరిమితి ఉంటుందని, ఓ1 వీసాలకు ఎలాంటి పరిమితి ఉండదన్నారు. ఈ వీసా పొందిన వారు తమ రంగాలలో పనిని కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఇన్వెస్టర్‌గా వీసా(ఈబీ-5) లను సులభంగా పొందవచ్చన్నారు. సుమారు 8 లక్షల డాలర్లను పెట్టుబడి పెడితే వీసాను పొందవచ్చన్నారు.


తమకు న్యూయార్క్‌లో మూడు కార్యాలయాలు ఉన్నాయన్నారు. తెలంగాణ నుంచి తమకు ఎక్కువగా హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయన్నారు. అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. యూఎస్‏లో తెలుగు వారికి ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తగిన పరిష్కారాలను చూపేందుకు గెహీ వారు నగరంలో శాఖను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 01:34 PM