Share News

Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది

ABN , Publish Date - Sep 16 , 2024 | 02:40 PM

బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరిచిపోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబరు 17ని జరపడం లేదని బండిసంజయ్ విమర్శించారు.

 Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది

కరీంనగర్ జిల్లా: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవమని... తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినరోజు అని గుర్తుచేశారు. రజాకార్ల అరాచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేమని బండి సంజయ్ అన్నారు.


ALSO READ: Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ ఈరోజు(సోమవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరిచిపోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబరు 17ను జరపడం లేదని విమర్శించారు. ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.


ALSO READ: Jani Master: జానీ మాస్టర్‌పై కేసులో కీలక విషయాలు వెలుగులోకి

తెలంగాణలో ఎవరూ అధికారంలో ఉంటే వారికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15లాగా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. మొన్నటిదాక హైడ్రా..... ఇప్పుడు విగ్రహాల లొల్లి అని విమర్శలు చేశారు. ప్రజా పరిపాలన దినోత్సవం అంటే తాము ఒప్పుకోమని... తెలంగాణ విమోచన దినోత్సవం అనడానికి కాంగ్రెస్ పార్టీకి అంత భయమెందుకని బండి సంజయ్ నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 16 , 2024 | 03:03 PM