Share News

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Sep 16 , 2024 | 09:29 AM

Telangana: తెలంగాణ రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం
BRS Working President KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ(Telangana) రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలోనే నిర్ణయించామని.. ఇప్పుడెలా రాజీవ్ విగ్రహాన్ని పెడతారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
(BRS Working President KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాజీవ్ విగ్రహ ఆవిష్కరణపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.

సీక్రెట్‌ ఆపరేషన్‌.. సీక్రెట్‌ ఫండ్‌


కేటీఆర్ ట్వీట్ ఇదే..

తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?

తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?

తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?

తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?

తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..

“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..

“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??

తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!


రాజీవ్ విగ్రహం పెడితే...

కాగా.. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని గతంలోనే కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


నేడే ఆవిష్కరణ..

ఈరోజు రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెష్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

Jobs: ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎస్‌బీఐలో 1511 పోస్టులకు అప్లై చేశారా లేదా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 16 , 2024 | 10:52 AM