Share News

HYDRA: ఫుల్ పవర్స్‌తో దూసుకుపోతున్న హైడ్రా

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:06 PM

Telangana: రాష్ట్రంలో హైడ్రా ఫుల్ పవర్స్ దూసుకుపోతోంది. మూసి ఆక్రమణల తొలగింపు హైడ్రా నెక్స్ట్ టార్గెట్‌గా ఉంది. ఈ వారాంతంలో మూసి వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. మూసిలో ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది.

HYDRA: ఫుల్ పవర్స్‌తో దూసుకుపోతున్న హైడ్రా
HYDRA

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో హైడ్రా (HYDRA) ఫుల్ పవర్స్ దూసుకుపోతోంది. మూసి ఆక్రమణల తొలగింపు హైడ్రా నెక్స్ట్ టార్గెట్‌గా ఉంది. ఈ వారాంతంలో మూసి వైపుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నాయి. మూసిలో ఇళ్లను నిర్మించిన వారిపై చర్యలకు హైడ్రా సిద్ధమైంది. మూసి ఆక్రమణల తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత 15 ఏళ్ళలో మూసి ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు భారీగా వెలిశాయి.

TS News: తెలంగాణ కేబినెట్ విస్తరణకు వెళాయే?


ఇప్పటికే చాదర్ఘాట్, మూసారాంబాగ్ మూసి ఆక్రమణలకు పాల్పడ్డ వారికి నోటీసులు జారీ అయ్యాయి. అర్హులైన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మూసి ఆక్రమణలపై ప్రభుత్వానికి హైడ్రా సమగ్ర రిపోర్ట్ అందజేసింది. మూసిలో 10 వేలకు పైగా ఇళ్ళు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.


మరింత బలోపేతం..

మరోవైపు చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌-అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్‌ కదిలింది. రెవెన్యూ, ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కిందిస్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయ శాఖ స్పష్టం చేసింది.

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..


ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్‌ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వద్దకు వెళ్లింది. ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి చేరనుంది. ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కనున్నాయి.


ఇవి కూడా చదవండి..

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. ఎందుకంటే?

CM Revanth: ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌లో సీఎం కీలక ప్రకటన

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 01:06 PM