Share News

Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం

ABN , Publish Date - Oct 20 , 2024 | 02:56 PM

బీఆర్ఎస్ ధర్నాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయకుండా.. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎక్కడ రాజీపడలేదని స్పష్టం చేశారు.

Minister Tummala:  రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం
Minister Thummala Nageshwar Rao

ఖమ్మం: బీఆర్ఎస్ ధర్నాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎగొట్టిన రూ. 7,600 కోట్లు రైతు బంధు తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. రైతుబంధు పేరు చెప్పి వ్యవసాయ యాంత్రీకరణ.. పంటల భీమా.. డ్రిఫ్ ఇరిగేషన్ పథకాలు అటకెక్కించారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు.

అధికారంలో ఉన్నపుడు రైతులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ధర్నాలకు రైతుల నుంచి స్పందన లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగులో లేని భూములకు కూడా..రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారని మంత్రి తుమ్మల ఆరోపించారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.... సాగులో లేని భూములకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.


వరి సాగుతో ఉరి అని.. సన్నాలు సాగు చేయాలని అన్నారని అన్నారు. మొక్క జొన్న, పత్తి వద్దని రైతులను కేసీఆర్ పాలనలో అయోమయం చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి రొట్ట విత్తనాలు సబ్సిడీ చెల్లించక చేతులెత్తేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు బీఆర్ఎస్‌పై విశ్వాసం లేకనే కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు.


రైతుల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామన్న కృతజ్ఞతతో దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ అమలు చేశామని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల భీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలతో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. రేవంత్ పాలనలో మొదటి పంట కాలంలోనే రూ. 27 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టామని అన్నారు. సన్న వడ్లకు రూ.500లు బోనస్‌తో ఎకరాకు అదనంగా రూ.8 నుంచి రూ.10 వేల ఆదాయంతో రైతులు వాళ్ల కాళ్లపైన వారు నిలబడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.


బీఆర్ఎస్ ధర్నాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయకుండా.. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వరంగల్ రైతు డిక్లరేషన్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎక్కడ రాజీపడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ జన్మదినం డిసెంబర్ 9 నాటికి పూర్తి స్థాయి రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రైతాంగం యావత్ దేశానికే మార్గదర్శిగా నిలుస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 04:06 PM