Share News

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?

ABN , Publish Date - Jul 24 , 2024 | 09:27 AM

Telangana: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు మొదలవగా.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఈ ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్ నెస్ తనిఖీ, తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు...

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?
Telangana Assembly Session

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (Telangana Asssembly Budget Session) రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు మొదలవగా.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఈ ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్ నెస్ తనిఖీ, తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో క్రీడా సముదాయం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్.ఐ.టి ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు, రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు, జాతీయ రహదారి విస్తరణ పనులు, మూసీ నదికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానంపై చర్చించనున్నారు.

Kamala Harris: పోల్ సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్


అనంతరం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం రైతు రుణమాఫీపై షార్ట్ డిస్కర్షన్ జరుగనుంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగులపై పెట్టిన కేసులు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక, గ్రూప్ - 2, గ్రూప్- 3 పోస్టుల సంఖ్య పెంచాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ఇవ్వనునుంది.


ఇవి కూడా చదవండి...

టీటీడీలో అక్రమాలు వాస్తవమే

Budget Highlights : ఏపీ హ్యాపీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 09:34 AM