TS News: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత... సీఎం డౌన్ డౌన్ అంటూ
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:14 PM
Telangana: అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని ముట్టడించేందుకు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు యత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30శాంత నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 31: అసెంబ్లీ గన్‌పార్క్ (Gunpark) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని (Telangana Assembly) ముట్టడించేందుకు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు యత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30శాంత నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
CM Revanth: ‘చీల్చిచెండాడుతా’ అన్న కేసీఆర్‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..
అలాగే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలన్నారు. విద్యా శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పోలీసుల అరెస్టుకు నిరసనగా సీఎం డౌన్ డౌన్ అంటూ విద్యార్థి సంఘం నాయకులు నినాదాలు చేశారు.
అసెంబ్లీ లోపలా రచ్చరచ్చే...
మరోవైపు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు శృతిమించాయి. ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్యవినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం నడిచింది. అలాగే కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులు కూడా కౌంటర్‌లు ఇచ్చారు. ముందుగా కేటీఆర్ మాట్లాడుతూ... విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారని.. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తుందన్నారని అన్నారు. ఏపీ - తెలంగాణలో మత ఘర్షణలు వస్తాయన్నారని, అలాగే తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. అంతేకాకుండా తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా? అని కూడా అన్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావని.. ఉన్నవి పోతాయన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు టాప్-4 స్టేట్స్‌లో తెలంగాణ ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులోనే పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయన్నారు. ‘‘బీఆర్‌ఎస్ పాలన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు.. గత కాంగ్రెస్ పాలనపై మేమెందుకు మాట్లాడకూడదు’’ అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు. పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR Vs Revanth: కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!
అయితే కేటీఆర్‌కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మేము చేయకపోతే ప్రజలే మాకు బుద్ది చెబుతారన్నారు. కొంచెం ఓపికగా ఉండాలని అని మంత్రి సీతక్క అన్నారు. దీనికి తిరిగి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఓపికగా ఉండాల్సింది మంత్రులు అని.. తాము కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కూడా మాకు పోటీగా హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం అని ప్రజలు నమ్మారన్నారు. మమ్మల్ని గెలిపించారని.. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. మొదటి బడ్జెట్‌కే ఇంత భయపడితే.. మరో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశ పెడితే ఎంత భయపడతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్దం నెలకొంది. కేటీఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లకు పోలిక ఉందని.. కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్నా పర్సెంట్ ఇంటిలిజెన్స్ అంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు ఓపిక, సహనం ఉండాలని సలహా ఇచ్చారు. కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. సభను తప్పుదోవ పట్టించటానికి కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయి.. ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు’’ అని అన్నారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
KTR: అప్పులు చెప్పిన వాళ్లు.. ఆస్తులు కూడా చెప్పాల్సిందే...
CM Revanth: ‘చీల్చిచెండాడుతా’ అన్న కేసీఆర్‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..
Read Latest Telangana News And Telugu News