Share News

TG RTC Bus: ఆర్టీసీ ఛార్జీల పెంపు దుమారం

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:29 PM

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు అంశం దుమారం రేపుతోంది. ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ బస్సులకు లేవని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

TG RTC Bus: ఆర్టీసీ ఛార్జీల పెంపు దుమారం
Harish Rao VS Sajjanar

హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండగ అయ్యింది. ఫెస్టివల్ కోసం ఊరెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే ఫర్లేదు. టికెట్ బుక్ చేసుకోలేదా..? అంతే సంగతులు. ప్రైవేట్ ట్రావెల్స్ చేతిలో మోసపోవడం ఖాయం. తెలంగాణలో పెద్ద పండగ దసరా. ఫెస్టివల్ కోసం సిటీ నుంచి చాలా మంది ఊరు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్స్ ఇప్పటికే బుక్ అయ్యాయి. స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్, కార్లు అందినకాడికి దోచుకుంటున్నాయి.


RTC BUS.jpg


ఛార్జీల పెంపు..

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల గురించి మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు. ‘పండగ కోసం ఊరు వెళ్లి, తిరిగి సిటీకి వచ్చే వారికి ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీ వసూల్ చేస్తున్నారు. బస్సుల సంఖ్యను ఏమాత్రం పెంచలేదు. పైగా టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు అని’ హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టికెట్ రేట్ల పెంపు గురించి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హరీశ్ రావు ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.


sajjanar.jpg


పెంచలేదే

‘ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఎప్పటిలాగే ఉన్నాయి. స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఎక్కువ ఛార్జీలు ఉన్నాయి. పండగ సమయాల్లో జిల్లాలకు వెళ్లిన స్పెషల్ బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయి. ఖాళీగా వచ్చే స్పెషల్ బస్సులకు డీజిల్ ఖర్చుల కోసం ఛార్జీలను పెంచాం. చార్జీల పెంపు ఇప్పుడు ప్రవేశ పెట్టలేదు. 2003 నుంచి స్పెషల్ బస్సులకు ఛార్జీలు పెంచుకునే సదుపాయం ఉంది. పండుగ సందర్భంగా నడిచే 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఎక్కువ ఛార్జీలు ఉన్నాయి. 8500 రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉన్నాయి అని’ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.


harish-rao.jpg


స్కూళ్లు, కాలేజీలు ఓపెన్

దసరా పండగ శనివారం వచ్చింది. ఆదివారం సెలవు.. కొందరు పండగను సండే జరుపుకున్నారు. మంగళవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ అవుతాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి బస్సుల్లో రద్దీ నెలకొంది. తెలంగాణలో ఏ టౌన్ బస్ స్టాప్‌లో అయినా సరే జనం గుమిగూడి ఉన్నారు. బస్సుల కోసం, బస్సుల్లో సీట్ల కోసం చూస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ బస్సుల్లో సీట్లను ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నారు. దాంతో మిగతా వారు వేచి చూడక తప్పడం లేదు.

ఇవి కూడా చదవండి:

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 14 , 2024 | 05:31 PM