PM Modi: నేడు జగిత్యాల పర్యటనకు మోదీ.. బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
ABN , Publish Date - Mar 18 , 2024 | 09:01 AM
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్‌సభ (Lok Sabha)లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ జగిత్యాల (Jagitial) పర్యటనకు వెళతారు. 11.15 గంటలకు అక్కడ బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 11.30 నుంచి 12.20 వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగిస్తారు.
కాగా జగిత్యాల సభను నిజామాబాద్ (Najamabad), కరీంనగర్ (Karimnagar), పెద్దపల్లి (Peddapalli) పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసేలా కమలం నేతలు ప్లాన్ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్ (Bandi Sanjay), ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind), గోమాసే శ్రీనివాస్ (Gomase Srinivas) అభ్యర్థులను మోదీ ఆశీర్వాదిస్తారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనున్నది. సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మూడు నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేసినట్లు తెలుస్తోంది. ఈ సభ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ తిరుగు పయనమవుతారు. బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళతారు.