Share News

TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:41 PM

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ...

TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం

హైదరాబాద్: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ. ఈ క్రమంలో కౌశిక్ ఇంటిపై కార్యకర్తలు, అనుచరులు టమోటాలు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా ఇది కాస్త బర్నింగ్ టాపిక్ అయ్యింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో చూడగలరు..

Updated Date - Sep 12 , 2024 | 03:43 PM