Share News

Mohan Babu: భూస్వాములపై మోహన్ బాబు పోస్ట్.. ఈ మెసేజ్ ఎవరి కోసమో..

ABN , Publish Date - Dec 09 , 2024 | 07:20 PM

ఫ్యామిలీ గొడవల మధ్య సినీ నటుడు మంచు మనోజ్ నిన్న గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తన పై తన తండ్రి మోహన్ బాబు దాడికి పాల్పడినట్టుగా మనోజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు తాజా సోషల్ మీడియా పోస్టు నెట్టింట వైరలవుతోంది..

Mohan Babu: భూస్వాములపై మోహన్ బాబు పోస్ట్.. ఈ మెసేజ్ ఎవరి కోసమో..
Mohan Babu

సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్టుగా నిన్నటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ట్విట్టర్ పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన తన ఎక్స్ హ్యాండిల్ లో 1998 విడుదలైన శ్రీరాములు సినిమాలోని ఓ సీన్ ను పోస్ట్ చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా తాను నటించిన ఈ పాత్రను గుర్తుచేస్తూ.. డైరెక్టర్ శంకర్, నిర్మాత పరిటాల సునీత, అందులోని పాత్రధారులను అభినందిస్తూ పోస్టు పెట్టారు.


మతలబు అదేనా..?

ఈ సీన్ లో మోహన్ బాబు పాత్ర ఆస్తి తగాదాల మధ్య ఆఖరికి ప్రాణాలు కోల్పోయినట్టుగా ఉన్న సీన్ ను ఆయన పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఇంతకీ ఇప్పుడీ పోస్టు పెట్టడానికి గల కారణం ఏంటి? అని కామెంట్లు పెడుతున్నారు. ఓ వైపు ఆయన కుటుంబంలో ఆస్తుల కోసం కుమారులు కుమ్ములాడుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు తన పాత సినిమా సీన్లను పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏదో మీనింగ్ ఉందని కొందరు అంటుంటే.. మోహన్ బాబు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అని మరికొందరు చర్చించుకుంటున్నారు.


‘కోరికలే గుర్రాలైతే’..

ఇక ఆదివారం గొడవ జరిగిందని చెప్తున్న రోజు సైతం మోహన్ బాబు తన ఎక్స్ అకౌంట్ లో యాక్టివ్ గా ఉండటం గమనార్హం. మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరడానికి కొన్ని నిమిషాల ముందే ఆయన తన పాత సినిమాలోని ఓ సీన్ ను పోస్టు చేశారు. 1979లో వచ్చిన ‘కోరికలే గుర్రాలైతే’ అనే సినిమాలో మోహన్ బాబు తొలిసారిగా యమధర్మరాజు పాత్రపోషించిన విషయాన్ని ప్రస్తావించారు. తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో తాను నటించిన ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ పోస్టులో రాసుకొచ్చారు. తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ఓ మైలురాయిగా పేర్కొన్నారు.

Hyderabad: మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు.. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం..


Updated Date - Dec 09 , 2024 | 07:34 PM