Share News

Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:51 AM

దసరా పండుగ.. రాష్ట్ర ఖజానాకు భారీ కిక్కు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యాయి.

Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

  • నాలుగు రోజుల్లోనే రూ.1000కోట్ల మద్యం అమ్మకాలు

  • ఈ నెలలో రూ.1900 కోట్ల విక్రయాలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ.. రాష్ట్ర ఖజానాకు భారీ కిక్కు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఏకంగా రూ.1000కోట్లపైనే మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ నెల ప్రారంభం నుంచి 14వ తేదీ వరకు మద్యం అమ్మకాలు రూ. 1900 కోట్లకు చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.852కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి.


ఆ తర్వాత 11వ తేదీ ఒక్క రోజే సుమారుగా రూ.205కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు తేలింది. అంటే.. 11 రోజుల్లోనే రూ.1057 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఇక, శని, ఆది, సోమ వారాలకు సంబంఽధించిన అమ్మకాలపై మంగళవారం మరింత స్పష్టత రానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం విక్రయాలు 6.55శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:51 AM