Share News

MLA : అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:42 AM

అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో పల్లె పండగ కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.

MLA : అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం
MLA inaugurating CC road in Rekalakunta village

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో పల్లె పండగ కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, డైనైజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖాలాలు లేవన్నారు. నియోజకవర్గం వ్యాప్తం గా రూ. ఆరు కోట్ల వ్యయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వేసవిలో నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందుస్తు ప్రణాళిక రుపొంది స్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన రాజ్‌, డీఈ అరుణ్‌కుమార్‌, జేఈ మద్దిలేటి, టీడీపీ కన్వీనర్‌ అశోక్‌, ఎంపీపీ సునీత, టీడీపీ జిల్లా నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, సాకే రామక్రిష్ణ, కేశన్న, లక్ష్మీనారాయణ, పొడరాళ్ల రవీంద్ర, ఓబులపతి, పెద్దప్ప, రమణమూర్తి, రమేష్‌, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 16 , 2025 | 12:42 AM