Share News

YS Jagan: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:06 PM

YS Jagan: వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ అసెంబ్లీ అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైనా.. టెక్నికల్‌గా మాత్రం మంగళవారం నుంచి లెక్కలోకి వస్తాయని వారు తేల్చి చెప్పారు. దీంతో జగన్‌పై అనర్హత వేటు పడే అవకాశముంది.

YS Jagan: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..
YCP Chief, Ex CM YS Jagan

అమరావతి, ఫిబ్రవరి 24: అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బడ్జెట్ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అసెంబ్లీ అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ రోజు అంటే.. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మాత్రమే చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. అంటే తొలి రోజు సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు తేల్చి చెప్పాారు.

పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆ క్రమంలో సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయని వారు సోదాహరణగా వివరించారు.


అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డే‌గా పిలుస్తారని వారు తెలిపారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్‌కు హజరైన.. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసినవి తాము పరిగణలోకి తీసుకోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అదీకాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు.. సమావేశాలకు హజరు కాకపోతే సీటు వేకెంట్ అంటూ డిక్లేర్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని ఈ సందర్భంగా అసెంబ్లీ ఉన్నతాధికారులు గుర్తు చేశారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయించింది. దీంతో జగన్ మెడపై 60 రోజుల సభకు గైర్హాజర్ అనర్హత కత్తి వేలాడుతున్నట్లు అయింది.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభమైన కేవలం నిమిషాల వ్యవధిలోనే తాను అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు ప్రతిపక్ష హోదా కేటాయించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయనతోపాటు మిగిలిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.


అయితే బడ్జెట్ సమావేశాలు ఈ రోజు అంటే.. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైనా.. సోమవారం కేవలం గవర్నర్ ప్రసంగం మాత్రమే జరిగిందని అసెంబ్లీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కానీ టెక్నికల్‌గా రేపు అంటే.. మంగళవారం ప్రారంభమవుతోందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు.. వైసీపీ సభ్యులు రికార్డులో చేసిన సంతకాలు పరిగణలోకి రావని వారు తెలిపారు.


అలాంటి వేళ.. 60 రోజుల పాటు వైఎస్ జగన్‌కు అసెంబ్లీలో హాజరు లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదని సుస్పష్టమవుతోంది.


గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఆయన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.


అయితే సభలో మీ పార్టీకి సంఖ్య బలం లేకుంటే ఈ హోదా కేటాయించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దాంతో ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్.. సోమవారం అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 05:08 PM