KRMB: కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీకి బిగ్ రిలీఫ్..
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:21 PM
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. నీటి వాటాల పంపిణీపై కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్‌లో ఉపశమనం లభించింది.

న్యూఢిల్లీ, జనవరి 16: కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. నీటి వాటాల పంపిణీపై కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్‌లో ఉపశమనం లభించింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ట్రైబ్యునల్ ఏకీభవించింది. 2023 ఆర్డినెన్స్ ప్రకారం నీటి కేటాయింపులపై.. విడివిడిగా వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ సమ్మతి తెలిపింది. ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో మూడు రోజులపాటు.. రాష్ట్ర వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ అంగీకారం తెలిపింది.
తొలుత విభజన చట్టంలోని సెక్షన్ 89 మేరకు.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై వాదనలు వినిపించారు. 811 టీఎంసీల్లో ఏపీ వాటా 512 టీఎంసీలను కొనసాగించాలన్న ఏపీ వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే, ఈ మొత్తం నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని ఏపీ వాదనలు వినిపించనుంది.
Also Read..
కారు సిద్ధంగా లేక.. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన సైఫ్..
సైఫ్ అలీఖాన్‌పై దాడిలో సంచలన విషయాలు..
తగ్గని మంటలు.. చంద్రగిరి పీఎస్‌కు మనోజ్
For More Andhra Pradesh News and Telugu News..