Rajamahendravaram : ఎన్‌ఐఆర్‌సీఏగా మారనున్న సీటీఆర్‌ఐ
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:07 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్(సీటీఆర్‌ఐ) ఇక నుంచి జాతీయ వాణిజ్య...

రాజమహేంద్రవరం రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్(సీటీఆర్‌ఐ) ఇక నుంచి జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఆర్‌సీఏ)గా మారనుంది. గత ఏడు దశాబ్దాలుగా పొగాకు పరిశోధనలో సీటీఆర్‌ఐ గణనీయమైన సేవలందించింది. అయితే ఇటీవల నిర్లక్ష్యపు పంటగా పొగాకు గుర్తింపు, పొగాకు ఉత్పత్తులపై వేటు, ఆరోగ్య పరిరక్షణ దిశగా ఎదుర్కొంటున్న సమస్యలు, భౌగోళిక పరిస్థితుల దృష్యా అడ్డంకులు, క్యూరింగ్‌లో కలప వినియోగం తదితర సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీటీఆర్‌ఐ డైరక్టర్ మాగంటి శేషు మాధవ్ ఆదివారం తెలిపారు.