Tirupati: తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:57 AM
ఆంధ్రప్రదేశ్: తిరుమల ఆలయ ఏర్పాట్ల విషయంలో తప్పుడు ప్రచారం చేయడంపై ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల ఆలయంపై మూడు యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రసారాలు చేశాయంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

తిరుపతి: తిరుమల ఆలయం(Tirumala Temple)పై తప్పుడు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్ల (YouTube Channels)పై ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు (SV University Police) కేసు నమోదు చేశారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. అయితే ఆయనకు సరైన దర్శనం కల్పించినప్పటికీ తప్పుడు ప్రచారం జరగడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP News: 145 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన వైసీపీ నేత..
చాగంటికి వసతుల విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహించారని, తగిన ఏర్పాట్లు చేయలేదని డయల్ న్యూస్, జర్నలిస్టు వైఎస్ఆర్, పోస్టు 360 అనే యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇవి కాస్త టీటీడీ దృష్టికి రావడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై తప్పుడు ప్రసారాలు చేశారంటూ టీటీడీకి చెందిన పురాణ, ఇతిహాసాల ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఏవీఎస్‌ఎస్ విభీషణ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు ఛానళ్లపై కేసు నమోదు చేసిన ఎస్వీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం..
Minister Nimmala Ramanaidu : డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!