Minister Nimmala Ramanaidu: జగన్‌పై మంత్రి నిమ్మల సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Feb 20 , 2025 | 07:17 PM
Minister Nimmala Ramanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయిందని.. రైతు సంక్షేమం కోసం చేసింది శూన్యమని మండిపడ్డారు.

రాజమండ్రి: ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో కక్షలు, కార్పణ్యాలు, కూల్చివేతలు విధ్వంసాలతోనే పాలన సాగిందని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
ALSO READ: CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవాళ(గురువారం) తూర్పు గోదావరి జిల్లా కూటమి నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడుగంటి పోయిందని.. రైతు సంక్షేమం కోసం చేసింది శూన్యమని మండిపడ్డారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని చెప్పారు. పంటలకు ఇన్స్యూరెన్స్ చేయించాలని కూడా జగన్‌కు తెలియదని విమర్శించారు. నిన్న గుంటూరు మిర్చి యార్డులో రైతుల కష్టసుఖాలు అంటూ వారిపై దండయాత్ర చేసినట్లుగా ఉందని ఆక్షేపించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడి, అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలను అణగదొక్కారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు పరదాల చాటున దాక్కొన్న జగన్, పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఉద్ఘాటించారు. ఇచ్చిన హామీలు క్రమక్రమంగా అమలు చేస్తూ, జగన్ చేసిన పాపాలు ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని చెప్పారు. సామాజిక పింఛన్లు రూ.3000 నుంచి రూ.4000 కు పెంచి ఇస్తున్నామని అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ విషయమై వడి వడి అడుగులు పడుతున్నాయన్నారు. పారిశ్రామికీకరణను విస్తృతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు శాయశక్తుల కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అతుకుల బొంతగా అధ్వానస్థితికి చేరిన ఆంధ్ర రాష్ట్ర రోడ్లను, ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అనతి కాలంలోనే మరమ్మతులు చేసి చూపించిందని చెప్పారు. గత ఐదేళ్లు ఉదయం సాక్షి పేపర్ కంటే ముందే పోలీసులు తమ ఇళ్లకు వచ్చి కేసులు పెట్టి వేధించారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Minister Anitha: ఆ అధికారులపై హోంమంత్రి అనిత ప్రశంసలు
YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
Read Latest AP News And Telugu News