Share News

M. Venkaiah Naidu : అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:17 AM

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

 M. Venkaiah Naidu : అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

  • నియంత్రణ లేకుంటే ఇబ్బందులు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కొత్తవలస, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరం మేరకే వినియోగించుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానం అనేది మానవ మేధస్సుతో వచ్చినదేనని, దాన్ని తయారు చేసుకున్న మనం అవసరం మేరకే వినియోగించుకుంటే ఇబ్బంది ఉండదన్నారు. అంతకంటే ఎక్కువగా వినియోగిస్తే మానవాళికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. క్రీస్తుపూర్వమే మన దేశంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, అప్పట్లోనే ఎంతో మంది తమ మేధా సంపత్తితో అభివృద్ధిలో పాలుపంచుకున్నారని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్థిక శాస్త్రవేత్తగా కౌటిల్యుడు ఖ్యాతి పొందారన్నారు. ఎలాంటి సాంకేతిక పరికరాలు లేని సమయంలోనే మన దేశ మేధావులు ఎన్నో ఆవిష్కరణలు చేశారన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఇప్పటికే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 04:17 AM