Share News

Botsa Satyanarayana : అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:22 PM

Botsa Satyanarayana: వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.

Botsa Satyanarayana :  అందుకోసమే అసెంబ్లీకి రాలేదు.. బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్
Botsa Satyanarayana

అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సత్యదూరంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ లేదన్నారు. . గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంటూ గవర్నర్ ప్రసంగించడం కరెక్ట్ కాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 యూనివర్సీటీ వీసీ‌లలో 19 మందిని రాజీనామా చేయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా వీసీలను రాజీనామా చేయించిందని మండిపడ్డారు. వీసీల రాజీనామాపై విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.


ఇవాళ(మంగళవారం) ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. సందర్భం కాని అంశాలను మంత్రి నారా లోకేష్ సభలో మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాజకీయ అవగాహన లేదని.. ఆవేశంతో మాట్లాడి ఉంటారని బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్ కల్యాణ్ అపోజిషన్‌లో ఉంటానంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తాము పదవులను కాపాడు కోవటానికి అసెంబ్లీకీ హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితితులు ఎదుర్కోటానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

Vamsi into custody: మూడు రోజుల కస్టడీకి వంశీ.. ప్రశ్నలు సిద్ధం చేసుకున్న పోలీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 03:28 PM