Emotional Incident.. వృద్ధ దంపతులకు తీరని కష్టం ..
ABN , Publish Date - Feb 06 , 2025 | 11:10 AM
పుట్టుకతోనే బిడ్డకు సమస్య ఉందని తెలిస్తే ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు ఆ శిశువును సజీవ సమాధి చేయడం.. లేక చెత్త కుప్పల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బిడ్డను అమ్మేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే పల్నాడు జిల్లాలోని ఓ వృద్ధ జంట మాత్రం పుట్టినప్పటి నుంచి నయంకాని ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన నలుగురు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

పల్నాడు జిల్లా: ఆ వృద్ధ దంపతులకు (Elderly Couple) తీరని కష్టం వచ్చింది. వారికి పుట్టిన నలుగురు పుట్టుక నుంచే మంచానికి పరిమితమయ్యారు. ఆకలి వేస్తే నోరు తెరిచి అన్నం కావాలని అడగలేని పరిస్థితి వారిది. 50 ఏళ్లు దాటినా (Even after 50 Years) ఆ తల్లిదండ్రులకు(Parents) ఆ నలుగురు కొడుకులు చంటి బిడ్డలే. ఇప్పటికీ తల్లిదండ్రులే వారి ఆలనా.. పాలనా చూడాల్సిన పరిస్థితి. వయోభారంతో తమ బిడ్డలు పడుతున్న అవస్థలు చూసి ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లుపోతున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..
ఆలన.. పాలన..
పల్నాడు జిల్లా, గురజాల మండలం, పల్లెగుంతకు చెందిన ధూలిపాళ్ల రామయ్య వెంగమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో నలుగురు పేరయ్య, సీతయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు పుట్టుకతోనే నయంకాని వ్యాధితో మంచానపడ్డారు. ప్రస్తుతం వారి వయసు 50 ఏళ్లకు పైబడింది. వయోభారంతో బాధపడుతున్న తమ కుమారుల ఆలన.. పాలన.. ఆ వృద్ధ దంపతులే చూసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొచ్చిన రామయ్య దంపతులు ఇప్పుడు వృద్ధాప్యంతో ఏ పనులు చేసుకోలేక.. నలుగురు కుమారుల ఆలన.. పాలన.. చూసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ఆ కుటుంబం సమస్య తెలుసుకుని ఆ కుటుంబంలో ముగ్గురికి పెన్షన్‌లు మంజూరు చేశారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక నిబంధనల పేరుతో ముగ్గురిలో ఒకరికి మాత్రమే పెన్షన్ పరిమితం చేశారు. దీంతో ఐదేళ్లుగా మంచానికే పరిమితం అయిన తమ బిడ్డలను పోషించడానికి రామయ్య దంపతులు నానా అవస్థలు పడుతున్నారు. వయసు మీద పడడంతో తాము వ్యవసాయం చేయలేకపోతున్నామని రామయ్య దంపతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ నలుగురు కుమారులకు ప్రభుత్వం పెన్షన్లు ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే.. పుట్టుకతోనే బిడ్డకు సమస్య ఉందని తెలిస్తే ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు ఆ సజీవ సమాధి చెయ్యడమో.. లేక చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ఆర్థిక ఇబ్బందులకు భయపడి బిడ్డను అమ్మేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే పల్నాడు జిల్లాలోని ఓ వృద్ధ జంట మాత్రం చిన్నప్పటి నుంచి నయంకాని ఆనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన నలుగురు కుమారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారు తమ పిల్లలను పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు తలుచుకొని తల్లడిల్లుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ
ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి జిల్లా కలెక్టర్ బస
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News