Share News

Anantha Sriram: ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:30 PM

Anantha Sriram: కల్కీ సినిమాపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని చెప్పారు.

Anantha Sriram: ఆ సినిమాలను  బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Anantha Sriram

విజయవాడ: సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీయడంపై అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల ఆత్మగౌరవం కోసం లక్షల మంది తరలివచ్చారని చెప్పారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అన్నారు. ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని చెప్పారు. జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నానని అన్నారు. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి చెబుతున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.


ALSO READ: Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

చరిత్రను వక్రీకరించారు..

హిందూ సమాజానికి .. ముందు తాను సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. క్షమాపణ చెప్పకపోతే తనకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదని అన్నారు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పలు పాత్రలు మార్చేస్తున్నారని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నిన్న, మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు కూడా కొన్ని పాత్రలను అవమానిస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి తాను సినిమా వాడిగా సిగ్గు పడుతున్నానని అన్నారు. ఈ కృష్ణా జిల్లాకే చెందిన దర్శకలు, నిర్మాతలే ఈ పొరబాటు‌ చెప్పక‌పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలా పాత్రలు ఔన్నత్యాన్ని మారిస్తే... హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు.


కర్ణుడు ఎలా గొప్పవాడు..

‘‘నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు. కల్కి సినిమాలో అగ్నిదేవుడు ద్వారా వచ్చిన అర్జునుడు కంటే.. సూర్యుడు ద్వారా వచ్చిన కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా..?? భారతంలోనే కాదు రామాయణం, భాగవతంలోనూ ఇష్టానుసారంగా పురాణాలను మార్చివేశారు. అభూత కల్పనలు వక్రీకరణలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం. చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయి . దమ్మారో దమ్ అంటూ హరే రామ హరే కృష్ణ అంటారా..?? ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరేట్ తాగుతూ అవమానిస్తారా..?? ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుందామా, సహిద్దామా, భరిద్దామా..?? రాముడు, కృష్ణుడు గొప్పతనం‌ చెబుతూ సిరివెన్నెల రాసిన‌ పాటలను ఆదర్శంగా తీసుకోండి. దైవమూర్తులు, స్వామీజీలను అనుకరించి వారిని అవమానపరిచేలా అవహేళన చేసేలా పాత్రలు చిత్రీకరిస్తున్నారు. ఒక దర్శకుడు బ్రహ్మాండ నాయకుడి అనే పదం ఉండకూడదని చెబితే నేను 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదు. తిరుపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉంటే నిర్మాతలు మిన్నుకుండి పోతున్నారు. మార్కెట్ ఉందనే కారణంతో హిందూ ధర్మాన్ని అవమానించినా ప్రోత్సహిస్తున్నారు. లేదా మన హిందువులే పూర్తిగా ఇలాంటి సినిమాలను బహిష్కరించాలి. అప్పుడే మన ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయి’’ అని అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి

HMPV virus: ఏపీలో కొత్త వైరస్ కేసులు.. ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..

Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్‌

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 05 , 2025 | 04:55 PM