Share News

Vallabhaneni Vamshi: వంశీ ఇంట్లో మరోసారి సోదాలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 02:08 PM

Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Vallabhaneni Vamshi: వంశీ ఇంట్లో మరోసారి సోదాలు
Vallabhaneni Vamshi

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని వంశీ నివాసంలో మరోసారి ఏపీ పోలీసులు (AP Police) సోదాలు నిర్వహించారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇంట్లో ఓ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాల్లో పాల్గొన్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్‌ భావిస్తున్నారు. వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజీని ఓ బృందం సేకరించింది. వంశీ కేసు కోసం ఏపీ సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోనులో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీని అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఫోస్ మిస్సైంది. దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు రెండు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 94 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు ఏపీ సీఐడీ 40 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ71గా వంశీ ఉన్నారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక టీం గాలిస్తోంది. అయితే వంశీని అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల కళ్లు గప్పి 40 నిమిషాల పాటు వంశీ హైడ్రామా ఆడారు. అదే సమయంలో వంశీ ఫోన్ కనపడకుండా పోయింది. నిన్న కూడా ఏపీ సీఐడీ పోలీసులు వంశీకి ఇంటికి వచ్చారు. ఏపీ సీఐడీ పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా వంశీ నివాసంలో సోదాలు చేశారు. వంశీ భార్య అందుబాటులో ఉండటంతో ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు సేకరించారు. అలాగే వంశీ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సేకరించారు.


కాగా.. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీమోహన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు (ఈనెల 27 వరకు) రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..

రైతన్నకు అండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 15 , 2025 | 02:17 PM