YS Jagan: విజయవాడ జైలుకు జగన్.. వంశీకి పరామర్శ
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:14 PM
YS Jagan: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ జైలులో పరామర్శించారు. ఈరోజు ఉదయం జగన్ విజయవాడ జైలుకు వచ్చారు.

విజయవాడ, ఫిబ్రవరి 18: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో (Former MLA Vallabhaneni Vamshi) జగన్ ములాఖత్ అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో వంశీ అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలులో వంశీని జగన్ పరామర్శించారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. జగన్‌తో పాటు వంశీని కలిసిన వారిలో తలశిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు.
అయితే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినానికి విజయవాడ జిల్లా జైలలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించేందుకు జగన్‌తో కలిసి కొడాలి నాని, పేర్ని నాని పేర్లు ఇచ్చారు వైసీపీ నేతలు. అయితే వీరిద్దరు వంశీని పరామర్శించేందుకు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలతో పేర్ని నాని, కొడాలి నానికి అనుమతి ఇవ్వలేమన్న జైల్ అధికారులు స్పష్టం చేశారు. జగన్‌తో పాటు వంశీని కలిసేందుకు సింహాద్రి రమేష్‌ను మాత్రమే జైల్లోకి వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు.
వంశీని పరామర్శించేందుకు జగన్ జిల్లా జైలుకు వచ్చిన నేపథ్యంలో ఆ మార్గంలో ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనప్పటికీ వైసీపీ కార్యకర్తలు మాత్రం బారికేడ్లను తోసుకునుని మరీ జైలు గేటు వద్దకు చేరుకున్నారు.
మరోవైపు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌లో పోలీసులకు ఎస్సీ ఎస్టీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వంశీ కస్టడీ పిటిషన్‌పై వంశీ న్యాయవాదులకు ఎస్సీ ఎస్టీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని వంశీ న్యాయవాదులకు కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ లేదా రేపు ఇరు వర్గాలు కౌంటర్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News