Share News

Maoist Commander : నక్సల్‌ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌ ముఖేశ్‌ అరెస్టు

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:41 AM

కొవ్వాడ సొమడ అలియాస్‌ ముఖేశ్‌ను (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Maoist Commander : నక్సల్‌ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌ ముఖేశ్‌ అరెస్టు

పాడేరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో మావోయిస్టు పార్టీ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేస్తున్న కొవ్వాడ సొమడ అలియాస్‌ ముఖేశ్‌ను (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కల్లేరు అటవీ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌ శుక్రవారం తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం.. ముఖేశ్‌ది ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పరిధిలోని గొంపాడ్‌ గ్రామం. 19 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఒడిశాలోని కుంట ఏరియా కమిటీలో యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అతనిపై 17 క్రిమినల్‌ కేసులున్నాయి. ముఖేశ్‌ వద్ద నుంచి పేలుడు పదార్థాలు కలిగిన క్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 04:41 AM