Share News

ZP budget: జడ్పీ బడ్జెట్‌ ఆమోదం

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:46 AM

ZP budget:జిల్లాపరిష త్‌కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్‌ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు.

ZP budget:  జడ్పీ బడ్జెట్‌ ఆమోదం
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాపరిష త్‌కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్‌ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన బుధవారం బడ్జెట్‌ సమావేశం జరిగింది. జడ్పీ సహా పీఐయూ, పంచాయతీరాజ్‌, పీఆర్‌ఐ శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి 2025-26 సంవత్సరానికి గాను మొత్తం అంచనా బడ్జెట్‌లో రూ.1580.59 కోట్లు రాబడిగాను, రూ.1462.20 కోట్లు ఖర్చులుగా చూపించారు. రూ.118.38 కోట్లు మిగులు బడ్జెట్‌గా పొందుపరిచారు. అలాగే అన్ని పద్దుల కింద 2024-25 సంవత్సరానికి గాను సవరణ బడ్జెట్‌లో రాబడి రూ.1411.55 కోట్లు కాగా, ఖర్చు రూ.1306 కోట్లుగా చూపించారు. అంతిమంగా రూ.105.22కోట్ల నిల్వగా చూపించారు. సభ్యులంతా అంశాల వారీగా చర్చ నిర్వహించి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్‌.ఎన్‌.వి.శ్రీధర్‌ రాజా, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ, జడ్పీ ఉపాధ్యక్షురాలు పాలిన శ్రావణి, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:46 AM