Bird Flu.. బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:33 AM
పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడులో ఒక పౌల్ట్రీ ఫాంలో 5వేల 500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా: చూస్తుండగానే కోళ్లు మృత్యువాత (Chickens Dead ) పడుతున్నాయి.. ఉన్నట్టుండి తలలు వాల్చేస్తున్నాయి.. కొన్ని కోళ్లు కొట్టుకుని చనిపోతున్నాయి. కోళ్లపై బర్డ్ ఫ్లూ (Bird Flu) దాడితో గోదావరి జిల్లాల్లో కలకలం రేగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో బ్రాయిలర్, ఫారం పౌల్ట్రీలు (Broiler, Farm Poultry) అధికం. పెరవలి మండలం, కానూరు అగ్రహారం పౌల్ట్రీలో చనిపోయిన కోళ్లను పరీక్షించగా బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు పశు సంవర్ధక శాఖ డీడీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. మరోవైపు ప్రజలు వారం రోజులపాటు చికెన్ (Chicken), గుడ్లు (Eggs) తినరాదని అధికారులు ప్రకటించారు.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్
తాజాగా యలమంచిలి మండలం, మేడపాడులో ఒక పౌల్ట్రీ ఫాంలో 5వేల 500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రష్యా, ఆస్ట్రేలియాల నుంచి భారీగా వలస పక్షులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఉంగుటూరు మండలం, బాదంపూడికి 10 కి.మీ. పరిధిలోని 31 పాఠశాలలకు గుడ్లు పంపిణీ నిలిపివేశారు. బాదంపూడి, వేల్పూరు, కానూరు గ్రామాల పరిధిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కర్నూలులో బర్డ్ ఫ్లూ కలకలం..
కాగా రెండు రోజుల కిందట కర్నూలు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించారు. అయితే.. చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ కర్నూలు నగరంలో వ్యాపిస్తోందని గురువారం బయట పడింది. దీంతో నగరంలో కలకలం రేగింది. కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌పేటలో పది కోళ్లు మృతి చెందినట్లు పశుసంవర్ధ్దకశాఖ అధికారులు గుర్తించారు. మృతి చెందిన ఒక కోడి శాంపుల్స్‌ను ల్యాబ్‌లో నిర్దారణ కోసం పంపించగా.. పాజిటివ్ రావడంతో వెంటనే ఎన్‌ఆర్ పేటలో రెడ్‌జోన్‌గా ప్రకటించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మృతి చెందిన 9 కోళ్లను బయటి ప్రదేశాలకు తరలించి గుంత తీసి పూడ్చినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ శ్రీనివాస్ రాత్రి 8 గంటల సమయంలో తెలియజేశారు. కలెక్టర్‌కు ముందస్తు సమాచారం అందించడంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
కర్నూలులో రెడ్ జోన్..
ఎన్‌ఆర్ పేటకు కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ హెచ్చరికలు అమలులో ఉంటాయని, కోళ్లను, గుడ్లను వ్యాపారుల అమ్మకుండా నిషేధం విధించాలని కలెక్టర్ రంజిత్ బాషా పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పది కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం నుంచి మొదలు పెట్టి సర్వే పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసినట్లు జేడీ తెలిపారు. శుక్రవారం ఎన్‌ఆర్ పేట కాలనీల్లో తమ అధికారులు, సిబ్బంది కోళ్ల దుకాణాలను పర్యవేక్షిస్తారని బర్డ్ ఫ్లూ తీవ్రతపై పరీక్షలు నిర్వహిస్తారని జేడీ తెలిపారు. పంచలింగాలతో పాటు ఆదోనిలో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, బయటి ప్రాంతం నుంచి కోళ్లు రాకుండా చర్యలు చేపట్టినట్లు జేడీ శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News