Share News

PM KISAN: రైతులకు శుభవార్త.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:47 AM

ఎట్టకేలకు రైతులకు శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే మళ్లీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయో తేలిపోయింది.

 PM KISAN: రైతులకు శుభవార్త.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు
PM KISAN Samman Nidhi

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) స్కీం కింద రైతులకు 19వ విడత డబ్బుల సాయం అందించే తేదీ ఖారారైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24, 2025న విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు.


వ్యవసాయ శాఖ మంత్రి..

గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు. ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు.


మూడు విడతలుగా...

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు.


పీఎం కిసాన్ లబ్ధిదారులు వారి జాబితాను ఎలా చూసుకోవాలంటే..

రైతులు తమ గ్రామం, జిల్లా, రాష్ట్రం ఆధారంగా PM-KISAN యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు ఈ క్రింది విధానాలను పాటించాలి.

ముందుగా PM-KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి

ఆ తర్వాత నో యూవర్ స్టేటస్ పై క్లిక్ చేయండి

అక్కడ మీరు నమోదు చేసిన రిజి స్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది

జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు


రైతుల కోసం..

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని ప్రతి సంవత్సరమూ కొనసాగించడమే కాక, క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బు జమ చేయడం ద్వారా, రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది.


ఇవి కూడా చదవండి:

Four Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. ఉద్యోగుల సంతోషం

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 12:34 PM