Hyderabad: దారుణం.. కాళ్లు చేతులు కట్టేసి.. కత్తితో పొడిచి..
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:15 AM
కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తిని అతని మూడో భార్య, ఆమె కుమారుడు కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలో జరిగింది.

హైదరాబాద్: కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తిని అతని మూడో భార్య, ఆమె కుమారుడు కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ మసీయుద్దీన్(66) వ్యాపారి. అతడికి ముగ్గురు భార్యలు. మసీయుద్దీన్ మూడో భార్యగా షబానాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు కుమారుడు ఉన్నాడు. తల్లీకుమారుడు బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్షిప్లో నివాసముంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోతో ఏమార్చి.. ఏం చేశారో తెలిస్తే.
మసీయుద్దీన్(Masiuddin) ముగ్గురు భార్యల వద్ద రెండురోజుల చొప్పున ఉంటాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మూడో భార్య షబానా వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో సమీర్, ఆయన తల్లి షబానా మసీయుద్దీన్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో కడుపులో, గొంతుపైన పొడిచి హత్యచేశారు. మృతదేహాన్ని ఇంట్లోనే వదిలిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తపరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News