Share News

Death certificate: భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్..

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:57 AM

బతికున్న భర్త పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌(Death certificate) పొందేందుకు యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో భర్తకు చెందిన ఆస్తులు చేజిక్కించుకొనేందుకు, గుర్తుతెలియని మృతదేహాన్ని చూపించి, భర్త చనిపోయినట్లు నాటకమాడిన మహిళ, డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకొనే సమయంలో పోలీసులకు చిక్కింది.

Death certificate: భర్త బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్..

- మహిళ అరెస్ట్‌

చెన్నై: బతికున్న భర్త పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌(Death certificate) పొందేందుకు యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం జిల్లా ఎడప్పాడిలో భర్తకు చెందిన ఆస్తులు చేజిక్కించుకొనేందుకు, గుర్తుతెలియని మృతదేహాన్ని చూపించి, భర్త చనిపోయినట్లు నాటకమాడిన మహిళ, డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకొనే సమయంలో పోలీసులకు చిక్కింది. రేవతి(Revati) అనే ఆ మహిళ భర్త విజయకుమార్‌ విదేశాల్లో పదేళ్లు ఉద్యోగం చేసి జూన్‌లో స్వగ్రామానికి తిరిగొచ్చాడు.

ఈ వార్తను కూడా చదవండి: Crocodile: కడలూరులో రోడ్డుపై మొసలి సంచారం..


విజయకుమార్‌ వచ్చిన రోజు నుంచే అతడితో గొడవ పడుతున్న రేవతి, భోజనంలో విషం కలిపి చంపుతానని బెదిరించి అతనిని ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో, డెత్‌ సర్టిఫికెట్‌ విచారణకు రెవెన్యూ శాఖ అధికారులు రేవతి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో విజయకుమార్‌(Vijaykumar) బతికే ఉన్నట్లు చుట్టుపక్కల వారి ద్వారా అధికారులు తెలుసుకున్నారు. భర్తని కావాలని ఇంటి నుంచి తరిమేసిన రేవతి, అతను కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


అనంతరం భవాని నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృతదేహాన్ని తన భర్తదే అంటూ, పోస్టుమార్టం రిపోర్ట్‌ వరకు అందర్ని నమ్మించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. రేవతికి మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల తనను బెదిరిస్తున్నట్లు విజయకుమార్‌ పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి పోలీసులు రేవతిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.


వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!

ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2025 | 11:57 AM