Share News

Secunderabad: గ్యాస్‌ రిపేర్‌ ముసుగున డ్రగ్స్‌ దందా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 09:30 AM

గ్యాస్‌ రిపేర్‌ పని పేరుతో డ్రగ్స్‌ దందా సాగిస్తున్న అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Secunderabad: గ్యాస్‌ రిపేర్‌ ముసుగున డ్రగ్స్‌ దందా..

- ఇద్దరి అరెస్ట్‌

- రూ.23 లక్షల విలువ గల సొత్తు స్వాధీనం

సికింద్రాబాద్: గ్యాస్‌ రిపేర్‌ పని పేరుతో డ్రగ్స్‌ దందా సాగిస్తున్న అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌ అలియాస్‌ మహేష్‌ సరెమ్‌(28), మహిపాల్‌(19) నేరేడ్‌మెట్‌లోని సైనిక్‌నగర్‌లో ఉంటున్నారు. ఇద్దరూ గ్యాస్‌ రిపేర్‌ పనులు చేస్తుంటారు. వారు రాజస్థాన్‌ నుంచి హెరాయిన్‌ తీసుకొచ్చి నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Janagama: రేపు కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’


ఈ నెల 10న రాజస్థాన్‌(Rajasthan) నుంచి 200 గ్రాముల హెరాయిన్‌(Heroin) తీసుకొచ్చిన మహేశ్‌ మహిపాల్‌తో కలిసి విక్రయిస్తున్నాడు. గ్యాస్‌ రిపేర్‌కు ఉపయోగించే పరికరాలకు సంబంధించిన ప్యాకెట్లల్లో డ్రగ్స్‌ పెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు నేరేడ్‌మెట్‌ పోలీసుల సహకారంతో వారిని నేరేడ్‌మెట్‌(Neredmet)లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న 190 గ్రాములు హెరాయిన్‌, ఒక్కొక్క గ్రామున్న పది ప్యాకెట్లు, ఓ బైక్‌, రెండు మొబైల్‌ ఫోన్లు,


city8.2.jpg

చిన్న వేయింగ్‌ మెషీన్‌, ఒక ప్లాస్టర్‌ సహా మొత్తం రూ.23 లక్షలు విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు రూ.88.33 కోట్ల విలువ గల డ్రగ్స్‌ను సీజ్‌ చేశామని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. డ్రగ్స్‌ అమ్మకాల ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ మహేశ్వరం ఎస్‌ఓటీ డీసీపీ కటకం మురళీధర్‌, నేరేడ్‌మెట్‌ సీఐ సందీప్ కుమార్‌, ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్‌ ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.


దోమలగూడలో గంజాయి విక్రేతలు..

ముషీరాబాద్‌: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దోమలగూడ దోబీఘాట్‌లో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి వినియోగదారులకు గంజాయి విక్రయించేందుకు వేచి ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు మౌలాలికి చెందిన యశ్వంత్‌గా, మరొకరు రామాంతాపూర్‌కు చెందిన సీహెచ్‌ వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌టీఎఫ్‌ ఎస్సై జ్యోతి తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 09:30 AM