JNTU: జేఎన్‌టీయూలో అక్రమాలపై విచారణ షురూ..
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:47 AM
జేఎన్‌టీయూ(JNTU) పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి చైర్మన్, కన్వీనర్‌లను నియమించారు.

హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి చైర్మన్, కన్వీనర్‌లను నియమించారు. రెక్టార్ విజయకుమార్ రెడ్డి(Vijayakumar Reddy) అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో సవరణ ఉత్తర్వులను రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు కమిటీకి అందజేశారు.
ఈ వార్తను కూడా చదవండి: GHMC: బర్త్ సర్టిఫికెట్లపై ఎస్బీ విచారణ
కమిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు లేకపోవడంపై సభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ససేమిరా అన్నట్లు తెలిసింది. వివిధ కళాశాలల నుంచి వచ్చిన ఫిర్యాదు కాపీలను కమిటీకి అందజేయకుండా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా విచారణ జరపమని కోరడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. కమిటీలో ఒకరిద్దరు కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు ఉంటేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, లేనిపక్షంలో విచారణ కంటితుడుపు చర్యే అవుతుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
అవకతవకల ఆరోపణలపై సమగ్రమైన విచారణ జరిగేలా కమిటీని మరింత బలోపేతం చేయాలని ఇన్‌చార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి(In-charge VC Balakishta Reddy)కి విజ్ఞప్తి చేస్తున్నారు. కమిటీ తొలి సమావేశానికి చైర్మన్ నర్సింహారెడ్డి, కన్వీనర్ కృష్ణమోహనరావు, సభ్యులు ప్రొఫెసర్ డీన్‌కుమార్, డాక్టర్ సింధు హాజరు కాగా, అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ తారాకల్యాణి గైర్హాజరైనట్లు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News