Share News

PM Narendra Modi: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన..

ABN , First Publish Date - Jan 08 , 2025 | 03:09 PM

PM Modi Meeting Live Updates: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నా మోదీ. సిరిపురం కూడలి సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్..

PM Narendra Modi: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన..
PM Narendra Modi Visakhapatnam Tour

Live News & Update

  • 2025-01-08T18:49:34+05:30

    తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ

    • ఏపీ ప్రజల ప్రేమ, అభిమానానికి నా కృతజ్ఞతలు: ప్రధాని

    • నా ప్రేమాభిమానాలు చూపించే సమయం వచ్చింది: ప్రధాని

    • మీ ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానిగా అవకాశం వచ్చింది: ప్రధాని

    • ఏపీ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తాం: ప్రధాని

    • ఏపీ అభివృద్ధి మా విజన్‌: ప్రధాని

    • ఏపీ ప్రజల సేవే మా సంకల్పం: ప్రధాని

  • 2025-01-08T18:45:45+05:30

    ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని..

    • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ

    • ఏపీ ప్రజల అభిమానానికి నా కృతజ్ఞతలు: ప్రధాని

  • 2025-01-08T18:44:08+05:30

    రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

    • వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

    • రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

    • విశాఖ రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన

    • పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు ప్రధాని శంకుస్థాపన

    • నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

    • కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ నోడ్‌, గుంటూరు-బీబీనగర్‌ లైన్ల డబ్లింగ్‌ పనులు..

    • గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

    • దువ్వాడ-సింహాచలం ట్రాక్‌ల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన

    • విశాఖ-గోపాలపట్నం ట్రాక్‌ల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన

    • చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

  • 2025-01-08T18:34:44+05:30

    విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ: చంద్రబాబు

    • 7 మండలాలను రాష్ట్రంలో విలీనం చేసిన వ్యక్తి మోదీ: చంద్రబాబు

    • ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్‌ నిర్మాణం చేస్తున్నాం: చంద్రబాబు

    • సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేసి తీరుతాం: చంద్రబాబు

    • ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఎయిమ్‌, ట్రైబల్‌, సెంట్రల్‌ వర్సిటీలతో పాటు..

    • 12 యూనివర్సిటీలు ఏపీకి కేటాయించారు: చంద్రబాబు

    • కేంద్రం సాయంతో నిలదొక్కుకున్నాం.. ముందుకెళ్తున్నాం: చంద్రబాబు

    • రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి: చంద్రబాబు

    • కష్టాలు, సమస్యలను అధిగమించి ముందుకెళ్తాం: చంద్రబాబు

    • కేంద్రం సాయంతో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకుంటున్నాం: చంద్రబాబు

    • మోదీ నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతుంటా: చంద్రబాబు

    • అమరావతి నిర్మాణంలో మోదీ సహకారం కావాలి: చంద్రబాబు

    • మోదీ శంకుస్థాపన చేసిన, మేము కలలు కన్న.. అమరావతిని త్వరలో పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

    • మోదీ సారథ్యంలోనే పోలవరం పూర్తితో పాటు.. నదుల అనుసంధానం పూర్తి చేస్తాం: చంద్రబాబు

  • 2025-01-08T18:19:53+05:30

    విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమైంది: చంద్రబాబు

    • రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు: చంద్రబాబు

    • 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం: చంద్రబాబు

    • నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు వస్తోంది: చంద్రబాబు

    • పూడిమడక దగ్గర..

    • ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌కు శంకుస్థాపన చేసుకున్నాం: చంద్రబాబు

    • ఏపీ చరిత్రలోనే ఇది నిలిచిపోయే రోజు: చంద్రబాబు

    • భవిష్యత్‌లోనూ మా కూటమి కొనసాగుతుంది: చంద్రబాబు

    • ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీఏనే: చంద్రబాబు

    • మేమంతా మోదీతోనే ఉంటాం: చంద్రబాబు

    • అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..

    • ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోదీ: చంద్రబాబు

    • మా కాంబినేషన్‌ ఎప్పటికీ ఉంటుంది..

    • ప్రధానిగా మోదీ ఉంటారు: చంద్రబాబు

    • ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ: చంద్రబాబు

    • దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ: చంద్రబాబు

  • 2025-01-08T18:14:57+05:30

    బలమైన భారత్‌ కోసం మోదీ కృషి చేస్తున్నారు: పవన్‌

    • దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ: పవన్‌

    • ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుంది: పవన్‌

    • సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిస్తే..

    • అది స్వచ్ఛ భారత్‌ అవుతుంది: పవన్‌

    • తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో..

    • నడిపిస్తున్న దార్శనికులు చంద్రబాబు: పవన్‌

    • ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు: పవన్‌

    • భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు: పవన్‌

    • ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు: పవన్‌

    • మోదీ రాకతో ఏపీకి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి: పవన్‌

    • మోదీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి: పవన్‌

    • ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ: పవన్

    • సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే: పవన్

    • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ఆశయం: పవన్‌

    • గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో ఏపీలో అంధకారం నెలకొంది: పవన్

    • అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా చంద్రబాబు కృషి: పవన్‌

    • రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మోదీకి అండగా ఉంటాం: పవన్‌

  • 2025-01-08T18:03:00+05:30

    మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది: మంత్రి నారా లోకేష్

    2047 నాటికి దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రదాని మోదీ కృషి.

    అన్ని రంగాల్లో పురోభివృద్ధిలో భారత్ ముందుంది.

    భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

    హర్ ఘర్ తిరంగా నమో నినాదం.

    ప్రధాని మోదీ ప్రజల మనిషి.

    బలమైన భారత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీ శ్రమిస్తున్నారు.

    దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ.

  • 2025-01-08T17:52:06+05:30

    త్రిమూర్తులు చేతులు కలిపితే..

    • త్రిమూర్తులు చేతులు కలిపితే.. తిరుగులేదని ఎన్నికలు రుజువు చేశాయి: ఎంపీ సీఎం రమేష్‌

    • దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చేందుకు మోదీ కృషి: ఎంపీ రమేష్‌

    • అనకాపల్లి నియోకవర్గంలో రెండు పెద్ద ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు త్రిమూర్తులకు కృతజ్ఞతలు: ఎంపీ సీఎం రమేష్‌

    • ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది: ఎంపీ సీఎం రమేష్‌

  • 2025-01-08T17:50:14+05:30

    విశాఖ బహిరంగసభలో ప్రధాని మోదీ

    • హాజరైన గవర్నర్ నజీర్‌, సీఎం చంద్రబాబు,..

    • డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు

  • 2025-01-08T17:43:20+05:30

    వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

    • విశాఖ రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన

    • పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు ప్రధాని శంకుస్థాపన

    • నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

    • కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ నోడ్‌, గుంటూరు-బీబీనగర్‌ లైన్ల డబ్లింగ్‌ పనులు..

    • గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

    • చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

  • 2025-01-08T17:37:41+05:30

    విశాఖ టూర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

    • రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.

    • రైల్వే జోన్‌, పారిశ్రామిక హబ్‌, హైడ్రోజన్‌ హబ్‌లకు శంకుస్థాపనలు.

    • దేశంలో పలు నేషనల్‌ హైవేలు, రైల్వే లైన్లను ప్రారంభించనున్న ప్రధాని.

    • వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన.

    • NTPC ఆధ్వర్యంలో పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్‌ హబ్‌కు శంకుస్థాపన.

    • నక్కపల్లిలో బల్క్ డ్రగ్‌ పార్క్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన.

    • కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ నోడ్‌, గుంటూరు-బీబీనగర్‌ లైన్ల డబ్లింగ్ పనులు.

    • గుత్తి-పెండేకల్లు డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.

    • చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని.

  • 2025-01-08T17:35:55+05:30

    ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో

    • ప్రధానితో పాటు పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్

    • అడుగడుగున ప్రజలు నీరాజనం.. పూల వర్షం కురిపించిన ప్రజలు

    • దారి మధ్యలో ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగిన రోడ్ షో

    • ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • 2025-01-08T17:31:47+05:30

    • AU కాలేజీ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన ప్రధాని మోదీ

    • కాసేపట్లో ప్రధాని మోదీ బహిరంగసభ

  • 2025-01-08T17:11:05+05:30

    ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

    • ప్రత్యేక ఓపెన్ టాప్ వాహనంలో బయలుదేరిన భారత ప్రధాని.

    • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

    • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

  • 2025-01-08T16:50:34+05:30

    INS డేగాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..

    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ నేతలు

    • తాటిచెట్ల పాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం వరకు ప్రధాని రోడ్‌షో

    • కాసేపట్లో సిరిపురం జంక్షన్‌ నుంచి ప్రధాని మోదీ రోడ్‌షో ప్రారంభం

  • 2025-01-08T16:35:14+05:30

    విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    • ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్‌ నజీర్‌,..

    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

    • కాసేపట్లో ప్రారంభంకానున్న ప్రధాని మోదీ రోడ్‌షో

    • రోడ్‌షోలో ప్రధాని వెంట పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌

    • సిరిపురం జంక్షన్‌ నుంచి AU కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధాని రోడ్‌షో

  • 2025-01-08T16:29:24+05:30

    ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

    • విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

    • సీఎంకు ఘనస్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్, డిజి, కలెక్టర్, సిఎస్ విజయనంద్.

  • 2025-01-08T15:09:32+05:30

    PM Modi Meeting Live Updates: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నా మోదీ. సిరిపురం కూడలి సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతోపాటు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు షోలో పాల్గొననున్నారు. కాగా ప్రధాని మోదీ రోడ్డు షో కు, బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయేలా ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.